తండ్రి ఆరోగ్యంపై తనయుడి వీడియో సందేశం

by Shyam |   ( Updated:2020-08-28 11:59:23.0  )
తండ్రి ఆరోగ్యంపై తనయుడి వీడియో సందేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి క్రమక్రమంగా కోలుకుంటున్నారు అని ఆయన కుమారుడు చరణ్ వెల్లడించారు. ఈమేరకు శుక్రవారం చరణ్ ఓ వీడియో విడుదల చేశారు. నిన్నటితో పోల్చితే తన తండ్రి ఆరోగ్యం కుదుట పడిందన్నారు. ఆయన ఊపిరితిత్తులపై కరోనా తీవ్రత తగ్గిందన్నారు. తన తండ్రి కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ చరణ్ కృతజ్ఞతలు అంటూ వీడియో సందేశంలో పేర్కొన్నారు. కాగా, ఇటీవల కరోనాతో ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story