పోలీసులు జాగ్రత్తలు పాటించాలి

by Shyam |
పోలీసులు జాగ్రత్తలు పాటించాలి
X

దిశ, మెదక్: లాక్ డౌన్ నేపథ్యంలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బంది ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్నీ జాగ్రత్తలు పాటించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడంలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రశంసించారు. ఈ మేరకు ఎస్పీ క్షేత్రస్థాయి సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిలో ఎండలు తీవ్ర మవుతున్న తరుణంలో అంతర్ రాష్ట్ర , జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది కోసం అవసరమైన గుడారాలు, భోజనాలు, మంచినీటి సౌకర్యాల ఏర్పాటు పై స్థానిక అధికారులు దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.

tag; sangareddy sp, chandrasekhar reddy, teleconference, ts news

Advertisement

Next Story