దొంగలు పారిపోతుండగా పరెగిత్తి పట్టుకున్న ఎస్పీ

by Sumithra |   ( Updated:2021-11-26 00:50:12.0  )
Sp-run
X

దిశ, వెబ్ డెస్క్: ముగ్గురు దొంగలు డబ్బులు దోచుకుని పారిపోతుండగా వారిని ఎస్పీ వెంబడించి పట్టుకున్న సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఎస్పీని ప్రశంసిస్తూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని వేలూరులో ఉన్న విష్ణుదుర్గ ఆలయం వద్ద ఓ వ్యక్తి వద్దకు బైక్ పై ముగ్గురు వ్యక్తులు వచ్చి కత్తితో బెదిరించారు. అనంతరం అతని వద్ద నుంచి రూ. 1200 నగదును లాక్కొని పరారయ్యారు. అక్కడి నుంచి నేషనల్ జంక్షన్ మీదుగా వారు వెళ్తున్నారు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన ఎస్పీ వారి చేతిలో కత్తి ఉండడాన్ని గమనించాడు. వెంటనే అతను వారిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం వారి నుంచి 3 కత్తులు, రూ. 1200 నగదు, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.

Advertisement

Next Story

Most Viewed