సాకులు చెబుతూ రోడ్లపైకి వస్తే కేసులే: ఎస్పీ భాస్కరన్

by Shyam |
సాకులు చెబుతూ రోడ్లపైకి వస్తే కేసులే: ఎస్పీ భాస్కరన్
X

దిశ, నల్లగొండ: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి సాకులు చెబుతూ బయట తిరిగితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్ హెచ్చరించారు. గురువారం జిల్లాలోని పలు కంటైన్‌మెంట్ జోన్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ భాస్కరన్ మాట్లాడుతూ లాక్‌డౌన్ నేపథ్యంలో సూర్యాపేటలో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారన్నారు. కానీ, కొంత మంది ఉద్దేశపూర్వకంగా సాకులు చెబుతూ రోడ్లపైకి వస్తున్నారన్నారు. జిల్లాలో ఇప్పటికే లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 110 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. డ్రోన్ కెమెరాల ద్వారా కంటైన్‌మెంట్ ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నామన్నారు.

Tags: SP bhaskaran, comments, lockdown, Violation, suryapet

Advertisement

Next Story