గిరిజనేతరుల చేతుల్లోకి పోడు భూములు : సోయం బాపురావు ఫైర్

by Aamani |
గిరిజనేతరుల చేతుల్లోకి పోడు భూములు : సోయం బాపురావు ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. పోడు భూములు గిరిజనేతరుల చేతుల్లోకి వెలుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

317 జీవోతో గవర్నర్ పరిధిలో ఉన్న 5th షెడ్యూల్‌ను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనవరి 9న ఆదివాసీ చట్టాలను కాపాడాలని కోరుతూ భద్రాచలంలో ‘మహిళల ఆదివాసీల సమ్మేళనం’ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.

Advertisement

Next Story

Most Viewed