- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సౌత్ కొరియాలో పెట్స్‌కు ఫ్రీ కొవిడ్ టెస్ట్
దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మనుషులతో పాటు జంతువులు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. మనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందంటే ఐసోలేషన్‌లో ఉండటం తప్పనిసరి. మరి జంతువులకు వస్తే? వాటిని కూడా ఐసోలేషన్‌లో ఉంచాలా? అంటే అలాంటి నిబంధన ఎక్కడా లేదు కానీ, దక్షిణ కొరియాలో మాత్రం ఇటీవల ఇటువంటి ఆంక్షలే అమల్లోకి వచ్చాయి. కుక్కలు, పిల్లులకు కరోనా పాజిటివ్ అని తేలితే ఐసోలేషన్‌లో తప్పక ఉంచాలని ‘కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ’ ఆదేశించింది. లక్షణాలు కనిపిస్తే జంతువులకు వెంటనే పరీక్షలు చేయించాలని, పాజిటివ్ అని తేలితే ఐసోలేషన్‌లో ఉంచాలని సూచించింది. ఒకవేళ ఇళ్లలో ఐసోలేషన్ కుదరకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో ఉంచాలని తెలిపింది. ఈ క్రమంలోనే దక్షిణ కొరియా పెట్ డాగ్స్, క్యాట్స్ కోసం కొవిడ్ పరీక్షలను ఉచితంగా చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది.
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పెంపుడు శునకాలు, పిల్లులకు ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న పెంపుడు పిల్లులు, కుక్కలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని సియోల్ మెట్రోపాలిటన్ ప్రభుత్వం సోమవారం తెలిపింది. దేశంలో మొట్టమొదటి జంతు సంబంధిత కొవిడ్ 19 కేసు ఇటీవలే నమోదు కాగా, ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. మొదటి కేసు ఒక చిన్న పిల్లిలో గుర్తించగా, ఇది మానవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. దీంతో ఆ దేశ ప్రభుత్వం పెంపుడు జంతువుల్లో సోకుతున్న కరోనాకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. కొవిడ్ పాజిటివ్ వచ్చిన పెట్ డాగ్స్, క్యాట్స్‌ను ఇంట్లో 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలి. ఒకవేళ యజమానులకు వైరస్ ఉంటే, వారి పెంపుడు జంతువులను సెపరేట్ కెన్నెల్ హోమ్స్‌కు లేదా క్యాటరీలకు పంపించాలి. అదే విధంగా కొవిడ్ లక్షణాలున్న పెంపుడు జంతువులకు, పాజిటివ్ వచ్చిన మనుషులతో కలిసి ఉంటున్న జంతువులకు ఇంటికి వచ్చే కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.