‘యూకే కన్నా దక్షిణాఫ్రికాలోని స్ట్రెయిన్ డేంజర్ కాదు’

by sudharani |   ( Updated:2020-12-25 10:09:02.0  )
‘యూకే కన్నా దక్షిణాఫ్రికాలోని స్ట్రెయిన్ డేంజర్ కాదు’
X

జోహెన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని కరోనా వైరస్ వేరియంట్ యూకేలో వెలుగుచూసినదాని కన్నా ప్రమాదకరమైనదన్న వ్యాఖ్యలను దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి కొట్టిపారేశారు. బ్రిటన్ ఆరోగ్య మంత్రి చేసిన ఆరోపణలను ఖండించారు.

యూకేలో వెలుగుచూసిన వేరియంట్ కన్నా 501.వీ2(దక్షిణాఫ్రికాలో కనిపించిన కొత్త స్ట్రెయిన్) వేగంగా వ్యాప్తి చెందుతుందని, ప్రమాదకరమైన స్ట్రెయిన్ అని చెప్పడానికి ఆధారాల్లేవని వెలిని ఖీజ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తూ ఆ దేశంలోని కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రమాదకరమైందని, తమ దేశంలో కనిపించిన స్ట్రెయిన్ కన్నా వేగంగా వ్యాపిస్తున్నదని బ్రిటన్ ఆరోగ్య మంత్రి మ్యాట్ హాంకాక్ బుధవారం పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed