- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సౌతాఫ్రికాకు భారత్ కరోనా వ్యాక్సిన్లు.. ఎదురు చూస్తున్న 92 దేశాలు
దిశ,వెబ్‌డెస్క్: వైరస్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచదేశాలకు భారత్ వ్యాక్సిన్ తో ఆపన్న హస్తం అందిస్తోంది. ఇప్పటికే భారత్ బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవులకు ఉచితంగా 32లక్షల టీకాల్ని పంపింది. ఇవి కాకుండా మరో 92 ధనిక,పేద దేశాలు భారత్ లో తయారైన వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాయి. అవసరాన్ని బట్టి ఆయాదేశాలకు వ్యాక్సిన్లను పంపేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. తాజాగా కేంద్రం దక్షిణాఫ్రికాకు 10 లక్షల డోసుల ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను అందించింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు రామఫోసా మాట్లాడుతూ.. భారత్ నుంచి తమ దేశానికి తొలి దశ కరోనా టీకాలు అందినట్టు చెప్పారు. ఈ నెలలోనే మరో 5 లక్షల డోసులు దక్షిణాఫ్రికాకు చేరుకోనున్నట్లు తెలిపారు. . ఆఫ్రికా ఖండానికి చెందిన సౌతాఫ్రికాలు సుమారు 1.4 మిలియన్ల కరోనా వైరస్ కేసులు నమోదు కాగా 44వేల మంది మరణించారు.