ఆ సత్తా ధోనీకి ఉంది.. డేల్ స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |
dale steyn
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న ఐపీఎల్ ఫైనల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌లో నువ్వా.. నేనా? అనే విధంగా తలపడేందుకు ఇరు జట్లు సిద్ధం అయ్యాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనీ లాంటి ఆటగాళ్లు ఎప్పుడూ బాగానే రాణిస్తారని అన్నారు. అతను ఫామ్‌లో ఉన్నా.. లేకున్నా టీమ్ గెలిపించుకునే సత్తా ధోనీలో ఉంటుందని వెల్లడించారు. అయితే, ఇవాళ్టి మ్యాచ్ కోసం కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాత్రం కొంచెం ఎక్కువ కష్టపడ్డాడని, ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా ఉండనుందని అన్నారు. అంతేగాకుండా.. ఈ ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్ కంటే సీఎస్‌కే మంచి ఫామ్‌లో ఉందని స్టెయిన్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story