ఇండియాలో పర్యటించే దక్షిణాఫ్రికా జట్టు..!

by Shyam |
ఇండియాలో పర్యటించే దక్షిణాఫ్రికా జట్టు..!
X

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ అనంతరం దక్షిణాఫ్రికా జట్టు త్వరలోనే ఇండియాలో పర్యటించనుంది. ఆస్ట్రేలియా పర్యటనకు దూరంగా ఉన్న డూప్లెసిస్, డస్సెన్‌‌లను తిరిగి జట్టులో చోటు దక్కింది. మొత్తం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును దక్షిణాఫ్రికా ప్రకటించింది. ఈ మేరకు భారత పర్యటనకు సంబంధించిన వివరాలను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో యువ స్పిన్నర్ జార్జ్ లిండేకు తొలి సారిగా జట్టులో చోటు కల్పించింది.

దక్షిణాఫ్రికా జట్టు :
క్వింటన్ డీకాక్ (కెప్టెన్, కీపర్), తెంబా బవూమా, రస్సీ డస్సేన్, డూ ఫ్లెసిస్, కైల్ వెరేయన్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, జాన్ స్మర్ట్స్, ఫెలుకువాయో, లుంగి ఎన్‌గిడీ, సిపమ్లా, బేరువన్ హెన్‌డ్రిక్స్, అన్రిచ్ నోజే, జార్జ్ లిండ్, కేశవ్ మహరాజ్

tags: south africa, team india, australia, ODI series, announced,

Advertisement

Next Story