మర్యాదపూర్వకంగానే కలిశా :గంగూలీ

by Shamantha N |
మర్యాదపూర్వకంగానే కలిశా :గంగూలీ
X

కోల్‌కతా: బీజేపీలో చేరుతారని వస్తున్న ఊహాగానాలపై బీసీసీఐ చైర్మన్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ కొట్టిపారేశారు. మిమ్మల్ని గవర్నర్ కలువాలనుకున్నప్పుడు మీరు ఆయన్ని కలవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. తాను కూడా అదే చేశానని గంగూలీ తెలిపారు. పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్‌తో ఆదివారం సౌరవ్ గంగూలీ సమావేశమైన విషయం విధితమే. ఆయనతో గంటపాటు చర్చించడంతో మాజీ కెప్టెన్ త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారనే ఊహాగానాలు బయల్దేరాయి. పలు రకాల విషయాలపై గంగూలీతో చర్చించానని, ఈడెన్ గార్డెన్స్ సందర్శించాలన్న ఆయన అభ్యర్థనను అంగీకరించినట్లు గవర్నర్ వివరణ ఇచ్చారు. గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని, ఊహాగానాలను ప్రచారం చేయవద్దని మీడియాను గంగూలీ కోరారు. ఈ విషయమై పశ్చిమబెంగాల్ రాజ్‌భవన్ కార్యాలయం కూడా స్పందించింది. గవర్నర్ జగదీప్ ధన్కర్‌ను సౌరవ్ గంగూలీ మర్యాదపూర్వకంగానే కలిశారని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేసింది.

Advertisement

Next Story