మరో 100 స్మార్ట్‌ఫోన్లు దానం చేసిన సోనూ

by Shyam |   ( Updated:2021-01-12 09:54:38.0  )
మరో 100 స్మార్ట్‌ఫోన్లు దానం చేసిన సోనూ
X

దిశ, వెబ్‌డెస్క్: సినీనటుడు సోనూ సూద్ చేసిన సేవ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల పాలిట దేవుడిగా మారిన సోనూ.. అప్పటి నుంచి అడిగినవారికి లేదనకుండా సాయం చేస్తూనే ఉన్నాడు. కరోనా ప్రభావంతో చాలా ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది పేద విద్యార్థులు సరైన మొబైల్స్ లేక చదువులకు దూరం అవుతున్నారు. ఇది గ్రహించిన సోనూ మహారాష్ట్రాలోని కోపర్ గావ్‌లో ఆరు స్కూళ్లకు చెందిన విద్యార్థుల కోసం 100 స్మార్ట్‌ ఫోన్లను బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఆ చిన్నారులు ఆన్‌లైన్‌ చదువులకు హాజరవుతున్నారు. ఇక సోనూ సేవాగుణంతో సదరు తల్లిదండ్రులు చేతులెత్తి దండాలు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed