- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్లాప్స్.. సోనూసూద్ మరో సూపర్ నిర్ణయం
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ మరో సూపర్ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ కాలంలో మృతిచెందిన వలస కార్మికుల కుటుంబాలకు, గాయపడిన వలస కార్మికులను ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. వారికి ఆర్థిక సాయం చేసేందుకు రెడీ అయ్యాడు. అంతేకాదు ఈ విషయం తన వ్యక్తిగత బాధ్యత అని స్పష్టం చేశాడు. ఈ విషయమై తన బృందం ఆయా రాష్ట్రాలకు చెందిన అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నది. ఉత్తరప్రదేశ్, ఝూర్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన 400 మంది వలస కార్మికులను గుర్తించినట్లు తెలిసింది. వారికి ఆర్థికంగా సాయం చేసేందుకు వారి చిరునామాలు, బ్యాంకు అకౌంట్ల వివరాలు తీసుకున్నట్లు తెలిసింది. వారికి త్వరలోనే ఆర్థిక సాయం చేస్తానని సోనూసూద్ ప్రకటించాడు.
ఇదిలా ఉంటే.. లాక్ డౌన్ సమయంలో తమ సొంత గ్రామాలకు వెళ్లలేక ఇబ్బందులు పడిన వలస కార్మికులను తన సొంత ఖర్చులతో వారిని క్షేమంగా ఇళ్లలోకి సోనూసూద్ తరలించిన విషయం తెలిసింది.