- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెటా హాటెస్ట్ వెజిటేరియన్స్ -2020 .సోను,శ్రద్ధ!
దిశ, వెబ్‌డెస్క్: రియల్ హీరో సోనూసూద్, బ్యూటిఫుల్ శ్రద్ధా కపూర్‌ను పెటా ఇండియా హాటెస్ట్ వెజిటేరియన్స్ – 2020గా ఎన్నుకుంది. ప్రో వెజిటేరియన్ పెటా ఇండియా ప్రింట్ క్యాంపెయిన్, హగ్ వెజిటేరియన్ డే క్యాంపెయిన్‌లో పాల్గొన్న సోను.. మెక్ వెగన్ బర్గర్‌ను మెక్ డొనాల్డ్స్ మెనూ లిస్ట్‌లో కూడా చేర్చాలని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. తన కొడుకుతో క్రికెట్ ఆడుతున్నప్పుడు గాయపడిన పావురాన్ని రక్షించి పెటా ఇండియాకు మద్దతిచ్చారు.
ఇక సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ పెటా ఇండియా ప్రచురించిన ‘కుక్ బుక్’ పుస్తకాన్ని చదివి మాంసాన్ని ముట్టుకోనని ప్రామిస్ చేసింది. ఈ పుస్తకం ద్వారా వెజిటేరియన్‌గా మారిపోయిన శ్రద్ధ.. తను రోజూ తీసుకునే డెలీషియస్ వెజిటేరియన్ మీల్స్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను కూడా శాకాహారులుగా మార్చడంలో సక్సెస్ అయింది. దీంతో పాటు జంతువుల సంరక్షణకు చేపట్టిన కార్యక్రమాల్లోనూ పాల్గొంది శ్రద్ధ.
ఈ కారణాల వల్ల పెటా ఇండియా సోను, శ్రద్ధను హాటెస్ట్ వెజిటేరియన్స్‌గా ఎన్నుకుంది. వారు తినేందుకు కూర్చున్న ప్రతీసారి కూడా ప్రపంచాన్ని శాకాహారంగా మార్చేందుకు ప్రయత్నించారని తెలిపారు పెటా ఇండియా సెలబ్రిటీ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ సచిన్ బంగేరా. మాంస రహితమైన ఆహారం తీసుకోవాలని.. పండ్లు, కూరగాయలు ఎప్పుడూ మహమ్మారికి కారణం కాలేదన్న పెటా ఇండియా కాన్సెప్ట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లారని.. అందుకే పెటా ఇండియా వారిని 2020 హాటెస్ట్ వెజిటెరియన్స్‌గా ఎన్నుకుందన్నారు.