- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి తన సేవా గుణాన్ని చాటిన సోనూసూద్
దిశ, వెబ్ డెస్క్: దేశంలో విస్తృంగా వ్యాప్తిచెందుతున్న కరోనా మహమ్మారిని, కట్టడి చేయడానికి లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అనేక కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. తినడానికి తిండి లేక కొన్ని కుటుంబాలు, ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లి ఇరుక్కుపోయిన కొన్ని కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ పేదలకు అందించిన సేవలు, ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. పేదలకు ఆర్థికంగా సాయ పడుతూ, ఇతర దేశాల్లో చిక్కుపోయిన కార్మికులను స్వదేశానికి రప్పించడానికి సోనూసూద్ చేసిన కృషి దేశంలోని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమాల్లో విలన్ లాగా కనిపించినా, రియల్ లైఫ్‌లో అందరి చేత హీరో అనిపించుకున్నాడు. తాజాగా ఆయన మరోసారి సోనూసూద్ తన మంచి మనసును చాటారు. లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్ వేర్ శారదకు ఉద్యోగం ఇచ్చారు. ఆమె ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముతున్న వీడియో మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం సోనూసూద్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. శారదకు తన వంతు సహాయం చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం తన ప్రతినిధి ఆమెకు జాబ్ ఆఫర్ లెటర్ అందించినట్టు సోనూసూద్ సోషల్ మీడియాలో వెల్లడించారు. సాఫ్ట్ వేర్ శారదకు సాయం చేయాలన్న ఓ నెటిజన్ ట్విట్టర్ లో చేసిన విజ్ఞప్తిపై.. సోనూ స్పందించారు. ‘‘మా ప్రతినిధి తనను కలిశారు. ఇంటర్వ్యూ పూర్తైంది. జాబ్ లెటర్ కూడా పంపించాం. జై హింద్’’అని సోనూసూద్ ట్వీట్ చేశారు. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్న వారందరి కోసం సోనూ ఇప్పటికే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాడు. తాజాగా ఓ కొత్త యాప్‌ను తయారు చేయబోతున్నారు. ఈ యాప్ ద్వారా అవసరంలో ఉన్నవారి అర్హతలను బట్టి ఉద్యోగం ఇచ్చే ఏర్పాటు చేయనున్నారు.