సోనూ‌సూద్ అంబులెన్స్ సర్వీస్‌

by Anukaran |   ( Updated:2021-01-19 03:19:46.0  )
సోనూ‌సూద్ అంబులెన్స్ సర్వీస్‌
X

దిశ, వెబ్‌డెస్క్: రియల్ హీరో సోనూ సూద్.. ‘సోనూ సూద్ అంబులెన్స్ సర్వీస్‌’ను ప్రారంభించారు. లాక్ డౌన్‌లో సోను సహాయ కార్యక్రమాల నుంచి స్ఫూర్తి పొందిన ట్యాంక్ బండ్ శివ.. తన దగ్గర ఉన్న డబ్బుతో అంబులెన్స్ కొనుగోలు చేసి ‘సోనూ సూద్ అంబులెన్స్ సర్వీస్‌’గా నామకరణం చేశారు. కాగా ఈ సర్వీస్‌ను స్వయంగా సోను ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేశారు ట్యాంక్ బండ్ శివ. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు థాంక్స్ చెప్పారు. తనను నమ్మి విరాళాలు అందించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ శివ చేస్తున్న కృషిని అభినందించారు సోను. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చిన శివను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story