కన్నతల్లిని రోడ్డుపై వదిలేసిన కసాయి కొడుకులు

by Anukaran |
కన్నతల్లిని రోడ్డుపై వదిలేసిన కసాయి కొడుకులు
X

దిశ, వెబ్ డెస్క్: అంబర్ పేట్ గోల్నాక డివిజన్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మాతృమూర్తికి అవమానం కలిగింది. పక్షవాతంతో బాధపడుతున్న కన్నతల్లిని రోడ్డుపై వదిలేశారు. వివరాల్లోకి వెళితే.. అంబర్ పేట్ గోల్నాక డివిజన్ లోని జైశ్వాల్ గార్డెన్స్ లో పక్షవాతంతో 70 ఏళ్ల వృద్ధురాలు కనిపించింది. తన కొడుకులే ఆ వృద్ధిరాలిని వదిలివెళ్లారని, ఆస్థి మొత్తం వారి పేరు మీద రాయించుకుని తనని అలా రోడ్డుమీద వదిలివెళ్లారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది గమనించిన స్థానికులు వారిపై మండిపడుతున్నారు.

Advertisement

Next Story