ఇంటిమేట్ సీన్స్‌‌లో భయపడలేదు:Sonia Rathee

by Jakkula Samataha |   ( Updated:2021-05-25 06:40:09.0  )
ఇంటిమేట్ సీన్స్‌‌లో భయపడలేదు:Sonia Rathee
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా, సోనియా రాఠీ.. త్వరలోనే ‘బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ 3’ (Broken But Beautiful) వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏఎల్‌టీ బాలాజీ (Broken But Beautiful Season 3 web series is now streaming only on ALTBalaji )ప్లాట్‌ఫ్లామ్‌పై స్ట్రీమింగ్ కానున్న ఈ రొమాంటిక్ వెబ్ సిరీస్‌లో వీరిద్దరి కిస్ సీన్‌ గురించి ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ గతంలోనే రివీల్ చేసింది. కాగా ఇందులో ‘రోమి’ అనే రిచ్ గర్ల్ రోల్ ప్లే చేస్తున్న సోనియా.. క్యారెక్టర్‌లో భాగంగా అన్‌కన్వెన్షనల్, బోల్డ్ థీమ్స్‌లో నటించడం పట్ల ఓపెన్ అయింది.

షోలో భాగంగా ఇంటిమేట్ సీన్స్‌లో నటించేందుకు తను భయపడలేదని ఒప్పుకుంది. ఈ మేరకు షో అనుభవాలను షేర్ చేస్తూ.. ‘ఏదేమైనా మేము ఒక స్టోరీని చెపుతున్నాం. అది కూడా నిజజీవితంలో జరిగే విషయాలను రియలిస్టిక్‌గా చూపిస్తున్నాం. ఒక్కసారి ఈ విషయాలన్నీ తలచుకుంటే, ఎలాంటి సీన్ అయినా మామూలుగానే అనిపిస్తుంది. అమ్మో.. నేను కిస్సింగ్ సీన్ చేస్తున్నానా? జనాలు ఏమనుకుంటారో అనే భావనే రాదు. కేవలం అది స్టోరీ మాత్రమే. అందుకే నేను భయపడలేదు’ అని వెల్లడించింది.

Advertisement

Next Story