ఢిల్లీ అల్లర్లకు వారే కారణం : అమిత్ షా

by Shamantha N |
ఢిల్లీ అల్లర్లకు వారే కారణం : అమిత్ షా
X

ఢిల్లీ అల్లర్లపై పార్లమెంటులో చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు. అల్లర్లకు బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. సీఏఏ వ్యతిరేక నిరసనకారులను అడ్డుపెట్టుకుని రాజకీయ కుట్రకు తెరలేపారన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకురాలు సోనియా గాంధీ, ఎఐఎంఐఎం పార్టీ నేత వారిస్ పఠాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే హింస చెలరేగిందని, అల్లర్లకు వారే కారణమని అమిత్ షా ప్రతిపక్ష సభ్యులకు బదులిచ్చారు. పోలీసులు లంచాలు తీసుకుని కేవలం ముస్లిములను మాత్రమే అరెస్టులు చేస్తున్నారని ఎంపీ అసద్ ప్రశ్నించగా..స్పందించిన హోంమంత్రి ఢిల్లీ పోలీసులను ఈ విధంగా అవమానించడం సరికాదన్నారు.
కేవలం 36గంటల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని, హింసకాండను పక్క ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డుకున్నారని కొనియాడారు. తమ ప్రాణాలను సైతం లెక్కకుండా రాళ్లు రువ్విన వారిని అరెస్టులు చేశారన్నారు. అల్లర్లో మృతిచెందిన వారి సంఖ్య 50 చేరగా, వారి కుటుంబాలకు అమిత్ షా తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఈనెల 25తర్వాత ఢిల్లీలో ఎక్కడా అల్లర్లు జరగలేదని, శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయన్నారు. సీఏఏపై కావాలనే ప్రతిపక్షాలు ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టించి ఆందోళనలను పో్త్సహించాయన్నారు. ఢిల్లీలో భయానక వాతావరణం సృష్టించేందుకు ఆందోళనకారులకు కొన్ని పార్టీలు ఆర్థిక సాయం చేస్తున్నాయని వారిని త్వరలోనే పట్టకున్నామని తెలిపారు.
అల్లర్లలో ఎవరైతే ప్రభుత్వ ఆస్తులను, ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారో నష్టపరిహారం కూడా వారే చెల్లించాలని స్పష్టంచేశారు. అంతేకాకుండా సీఏఏను ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తీసుకునేది లేదని పార్లమెంటులో హోంమంత్రి మరోసారి స్పష్టంచేశారు. బీజేపీ హయాంలో కంటే యూపీఏ హయాంలోనే ఎక్కువ అల్లర్లు చెలరేగాయని, అందుకు 1984 జరిగిన హింసాకాండను ఈ సందర్భంగా గుర్తుచేశారు. మారణహోమంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పూర్తి నివేదిక రాగానే పార్లమెంటుకు సమర్పిస్తానని, అల్లర్లకు కారణమైన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలేది లేదని అమిత్ షా ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభ నుంచి వాక్‌ఔట్ చేశారు.

Tags: amit shah, parliament, caa, delhi riots discussion, counter to opposition

Next Story

Most Viewed