- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమీర్ ఖాన్ "ఫున్సుక్ వాంగ్డు" రియల్ స్టోరీ
దిశ,వెబ్‌డెస్క్:సోనమ్ వాంగ్ చుక్..! అంటే తెలియని వారుండరు. భారత్ లోని కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ విద్యార్ధుల కోసం సోనమ్ వాంగ్ చుక్ 1988లో ఇంజినీరింగ్ డిగ్రీ పొందిన తర్వాత రూ.800కోట్లతో ద స్టూడెంట్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ మూవ్ మెంట్ ఆఫ్ లడాఖ్ (సిక్మల్) ను ఏర్పాటు చేశారు. అందులో లడాఖ్ విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలను కల్పించారు. ఈ సిక్మల్ లో విద్యాభోదనా బట్టి బట్టినట్లుగా కాకుండా ఇన్నోవేటీవ్ గా ఉండడంతో ప్రాచుర్యం పొందింది. దీంతో సిక్మల్ లో విద్యనభ్యసించేందుకు ఒక్క భారతీయులేకాకుండా ప్రపంచ దేశాలకు చెందిన విద్యార్ధులు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. త్రీ ఇడియట్స్ లో ప్రధాన పాత్ర దారి అయిన అమీర్ ఖాన్ పోషించిన ఫున్ సుఖ్ వాంగ్డూ పాత్ర సోనమ్ వాంగ్ చుక్ దే. ఇంతకీ ఈ సోనమ్ వాంగ్ చుక్ ఎవరో తెలుసుకుందాం.
విద్యకు – ఉపాదికి లంగరు వేసి సరిహద్దు లోయల్లో వెలుగులు విరజిమ్మిన అతడే లఢక్ ప్రజల ఆశాజ్యోతి. అక్షర సూరీడు. సోనమ్ వాంగ్ చుక్. హిమాలయాలు, కారా కోరం శ్రేణుల మధ్య దేశ సరిహద్దుల్లో కీలక ప్రాంతం. నాడు మధ్య ఆసియా దేశాల వాణిజ్యానికి మజిలీగా వెలసిల్లిన చరిత్రాత్మక ప్రదేశం. నేడు అందాల కాశ్మీరంలో అంతర్భాగం. బౌద్ధ సంస్కృతి విరాజిల్లే శాంతి శిఖరం. స్వయం పాలిత ప్రాంతం లఢక్. 3లక్షల జనాభా. భిన్నజాతులు. లఢకే, కాశ్మీరే, టిబెటన్, ఉర్దూ మాట్లాడే ప్రజలు. సముద్రమట్టానికి 11వేల అడుగుల ఎత్తున కొండంచు మంచు ఎడారి అది. అక్కడ దూరం దూరంగా..అక్షరాస్యతగా మరింత దూరంగా. లోయల్లో విసిరివేసినట్లుండే అనేక అనేక పల్లెలు. వాటిలో యులిటేక్పో ఒకటి. వాటిలో ఓ రాజకీయ కుమారుడు సోనమ్ వాంగ్ చుక్. అమ్మఒడిలోనే అక్షరాలు నేర్చుకున్నాడు. అనంతరం నుబ్రావ్యాలీలో మేనమామ ఇంట చదువుకున్నాడు. 1975లో తండ్రి మంత్రి అవ్వడంతో వారి మకాం శ్రీనగర్ కు మారింది. అక్కడి కేంద్రియ విద్యాలయంలో 3వ తరగతిలో చేరారు. కానీ అక్కడ సోనమ్ వాంగ్ చుక్ ఫెయిల్యూర్ స్టూడెంట్ గానే మిగిలిపోయారు. అందుకు కారణంగా స్కూల్లో విద్యాభోదన అంతా హిందీ, ఉర్దూలో ఉండడంతో అర్ధకాకపోయేవి. దీంతో అక్కడ ఉపాద్యాయులు తనని తెలివి తక్కువ వాడిగా ట్రీట్ చేసేవారు. దీంతో ప్రతీరోజూ తన్నులు తినేవారు. అందుకే ఆ స్కూల్ కు స్వస్తి..బంధువులు, స్నేహితుల సలహాతో ఢిల్లీకి వెళ్లారు. అక్కడ లఢఖీ భాషను ఆప్షనల్ గా ఎంచుకొని చదువుపై దృష్టి సారించారు. అలా మొదలైన వాంగ్ చుక్ ప్రస్థానం ఎల్లలు దాటింది.
మంచి భవిష్యత్ కావాలంటే ఇంగ్లీష్ రావాలన్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. స్థానిక భాషల్ లఢక్ భాషను అభిృద్ధి చేసే దిశగా కృషి చేశారు. ఆయన చేసిన కృషి ప్రారంభంలో నీరుగారింది. ఆ తరువాత విద్యార్ధులకు కొత్తదనం లేని ఆ సిలబస్ విద్యార్ధులకు గుదిబండలుగా మారిన వైనాన్ని తెలుసుకున్నారు. అందుకే 1988లో సాంప్రదాయ చదువుకు స్వస్తిచెప్పిఇన్నేవేటీవ్‌గా ఆలోచించేలా చదివేలా రూ.800కోట్లతో ద స్టూడెంట్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ మూవ్ మెంట్ ఆఫ్ లడాఖ్ (సిక్మల్) ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో లఢకీ భాషలో విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు అవసరమని భావించాడు. 1994లో ఆపరేషన్ న్యూ హోప్ ను ప్రారంభించారు. ఇందులో 700 మంది టీచర్లకు, వెయ్యి మంది వీఈసీ లీడర్స్ ట్రైనింగ్ ఇప్పించారు. ఆ తర్వాత వారు సాధించి ఫలితాలు అమోఘం. ముఖ్యంగా మెట్రిక్యూలేషన్ విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. 1996లో కేవలం 5శాతం ఉన్న ఉత్తీర్ణత, 2015 నాటికి 75శాతానికి పెరిగింది. విద్యార్ధులకు విద్యతో పాటు స్థానిక ప్రజలకు ఉపాది అవకాశాల కోసం విశేషంగా కృషి చేశారు. లేహ్ సమీపంలో మైనస్ 25డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయే ఈ ప్రాంతంలో సోలార్ ఇండస్ట్రీని స్థాపించి తద్వారా ఉపాది అవకాశాలు కల్పించారు. ఇలాఆయన లఢక్ ప్రజల కోసం, విద్యార్ధుల కోసం చేసిన కృషి అద్భుతమనే చెప్పుకోవాలి.
లడఖ్ లో వర్షం అతి తక్కువగా కురుస్తుంది. దీంతో ఇక్కడ జీవనాధారం వ్యవసాయం కష్టంగా మారడంతో వాన్ సుఖ్ కృత్తిమంగా ప్రతీగ్రామంలో మంచును ఏర్పాటు చేశారు. 2014లో ఓ రోజు పారుతున్న సెలయేటి దగ్గర ఆగాడు. కాసేపు నీళ్లను అలానే చూశాడు. అక్కడి బ్రిడ్జికి పక్కగా ఉన్న మంచు గడ్డపై సూర్యకిరణాలు పడుతున్నాయి. ఆ వేడికి అది మెల్లగా కరుగుతోంది. సూర్యుడి కాంతి పడని చోట.. మంచు తక్కువగా కరుగుతోంది. అప్పుడే.. మంచు కొండలు ఏర్పాటు చేయాలని సూపర్ ఆలోచన వచ్చింది.
మంచు కరిగినప్పుడు ఆ నీటిని స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఇందుకు లడఖ్ లోని చల్లటి పరిస్థితులను వాడుకోవాలని భావించారు. అనుకున్నట్లే పర్వతాలపై నుంచి కరిగి వృథాగా వెళ్లిపోతున్న నీళ్లను కిందికి తేవాలని నిర్ణయించారు. అలా ఎన్నుకున్న ప్రదేశానికి నీళ్ల పైపును అండర్ గ్రౌండ్ ద్వారా లాగారు. ఒక్కసారిగా అంత ఎత్తు నుంచి పైపులోకి వచ్చే నీళ్లు వేగంగా 60 మీటర్ల ఎత్తు గాల్లోకి విసిరికొట్టాయి. వెంటనే అక్కడి చల్లటి వాతావరణం నీటిని గడ్డ కట్టించేసింది. అలా 20 అడుగుల కొండ రెడీ అయింది. ఒక్కో కొండ కరిగితే 1.5 లక్షల లీటర్ల నీళ్లు అందుతాయి. ఏప్రిల్, మే నెలల వరకూ వీటిపై ఎండ పడకుండా జాగ్రత్తపడతారు. చాలా తక్కువ ఎత్తైన ప్రాంతాలు, వేడి ప్రదేశాల్లో కూడా మంచు కొండలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. గతంలో 4 వేల మీటర్ల ఎత్తులో నీళ్లను గాల్లోకి పంపి గడ్డ కట్టించారు. అయితే పైపులతో నీళ్లను గడ్డ కట్టించింది మాత్రం సోనమే. ఈ పద్ధతిలో టెక్నిక్ చాలా మార్చాల్సివుందని చెప్పారు.
ఇలా ఆయన చేసిన సేవలకు 1993 జమ్మూ కాశ్మీర్ విద్యా విధానంలో సంస్కరణలకు తెచ్చినందుకు వాన్ చుక్ కు గవర్నర్ మెడల్ దక్కింది.
2002లో ఆయనకు అమెరికా ఫెలో షిప్ అవార్డ్
2004లో ద గ్రీన్ అవార్డ్
2008 సీఎన్ ఎన్ ఐబీఎన్ ద రియల్ హీరోస్ అవార్డ్
2016 లో ఇంటర్నేషనల్ టెర్రా అవార్డ్
2016 రోలెక్స్ అవార్డ్
2017లో కృతిమ మంచుకొండల్ని ఏర్పాటు చేయడంపై గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కింది.
ఇక ఆయన విద్యా బోధన ఎలా ఉంటుందో చెప్పేందుకు 2009లో రాజ్ కుమార్ హిరానీ డైరక్షన్ లో 3ఇడియట్స్ అనే సినిమా తెరకెక్కింది. ఆ సినిమాలో అమీర్ ఖాన్ పాత్రకు ప్రేరణే ఈ సోనమ్ వాంగ్ చుక్. ప్రస్తుతం వాంగ్ చుక్ లఢాక్ ప్రాంతాభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తూ ఇండియాపై చైనా చేస్తున్న కుట్రల్ని తన సందేశాల ద్వారా తిప్పికొడుతున్నారు.