ఎగ్జైట్ అవుతున్న సోనమ్

by Shyam |
ఎగ్జైట్ అవుతున్న సోనమ్
X

బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెండ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీగా ఉన్న సోనమ్ భర్త ఆనంద్ ఆహుజాను ఎంతగా ఇష్టపడుతుందో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది. ఆనంద్ లాంటి భర్తను పొందడం అదృష్టమని చెప్పే సోనమ్ తనతో ఉంటే లోకాన్నే మరిచిపోగలను అని పోస్ట్‌లు కూడా పెడుతుంది.

సోనమ్ పుట్టినరోజున తల్లిదండ్రులతో గడిపేందుకు పుట్టింటికి పంపిన ఆనంద్ సోషల్ మీడియాలో తనకు నచ్చిన వ్యక్తులతో ఉన్న అందరి ఫొటోలను యాడ్ చేసి సోనమ్‌కు స్పెషల్ గిఫ్ట్ పోస్ట్ చేశాడు. దీనికి సోనమ్ కూడా చాలా థ్రిల్‌గా, హ్యాపీగా ఫీల్ అయింది. అయితే జూలై 30న ఆనంద్ బర్త్ డే ఉండటంతో తనను కూడా సర్ ప్రైజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది సోనమ్. బర్త్ డే‌కు ఇంకా వారం రోజుల టైమ్ ఉండటంతో తనకు నచ్చిన వస్తువుల గురించి తెలుసుకుంటూ.. గిఫ్ట్ ఇవ్వాలని చూస్తుంది. ఇందుకోసం ఆనంద్ బెస్ట్ ఫ్రెండ్ సహాయం తీసుకుంటుంది సోనమ్. ముందుగా ఆనంద్‌కు ఎలాంటి షూస్ ఇష్టమో తెలుసుకున్న సోనమ్.. సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

https://www.instagram.com/tv/CDBVyEAlqW6/?igshid=1rthcr39m97ie

Advertisement

Next Story