స్టార్ హీరోయిన్ ని బికినీ ఫోటో అడిగిన నెటిజన్.. ఏం పంపిందో తెలిస్తే షాక్..?

by Anukaran |   ( Updated:2021-08-27 03:55:53.0  )
స్టార్ హీరోయిన్ ని బికినీ ఫోటో అడిగిన నెటిజన్.. ఏం పంపిందో తెలిస్తే షాక్..?
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా వచ్చాక ప్రైవసీ తగ్గిందనే చెప్పాలి. ఇక హీరోయిన్లకు ఐతే ప్రైవసీ మాట పక్కన పెడితే లైంగిక వేధింపులు ఎక్కవయ్యాయి. అభిమానులతో ముచ్చటించిన ప్రతిసారి వారు ఏదో ఒక అవమానాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. నెటిజన్లు సైతం ఎలాంటి ప్రశ్నలు అడగాలి అనే విచక్షణ లేకుండా నోటికి ఏది వస్తే అది అంటూ వారిని ఇబ్బందికి గురిచేస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఒక నెటిజన్ అడిగిన ఇబ్బందికరమైన ప్రశ్నకు స్పాంటేనియస్ గా ఆన్సర్ చెప్పి శభాష్ అనిపించుకుంది . ఇటీవల అభిమానులతో చిట్ చాట్ సెషన్ స్టార్ట్ చేసిన ఈ భామ అభిమానులు అడిగిన ప్రశాలన్నింటికి ఓపిగ్గా సమాధానం చెప్పింది.

ఇక ఇందులో కొంతమంది ఆకతాయిలు సందిట్లో సడేమియాలా విరుచుకుపడ్డారు. “సోనాక్షి.. నీ బికినీ ఫోటోగ్రాఫ్ లు పంపు.. ప్లీజ్ అంటూ అడగగా.. సోనాక్షి తడుముకోకుండా ష్యూర్ అంటూ బికినీ డ్రెస్ పిక్స్ పంపి సర్ ప్రైజ్ చేసింది. అమ్మడి సెన్సాఫ్‌ హ్యూమర్‌కి అందరూ స్పెల్ బౌండ్ అయ్యారు. ఇక మరో అభిమాని ఏం తింటున్నారు బాగా వెయిట్ లాస్ అయ్యారు’ అని అడగ్గా.. గాలి తింటున్నా అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ చాట్ సెషన్ నెట్టింట వైరల్ గా మారింది. ఇబ్బందికరమైన ప్రశ్నల నుంచి తప్పించుకోకుండా స్పాంటేనియస్ గా సమాధానాలు చెప్పిన సోనాక్షిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Advertisement

Next Story