- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోషల్ డ్రామాలో సోనాక్షి
దిశ, వెబ్‌డెస్క్ : ట్రూ ఇన్సిడెంట్స్ నేపథ్యంగా సినిమాలు తెరకెక్కించడంలో బాలీవుడ్ దర్శకుడు శ్రీ నారాయణ్ సింగ్ ఎక్స్‌పర్ట్. ఇప్పటికే ‘టాయిలెట్ – ఏక్ ప్రేమ్ కథ, బత్తి గుల్ మీటర్ చాలు’ వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలందుకున్న డైరెక్టర్.. రెండు సంవత్సరాల తర్వాత మరో ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. ఇది కూడా వాస్తవ సంఘటనల ఆధారంగానే తెరకెక్కనుండగా.. ‘లూటేరా, అఖీరా, మిషన్ మంగళ్’ సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన బాలీవుడ్ బబ్లీ బ్యూటీ సోనాక్షి సిన్హా ఇందులో లీడ్ రోల్ పోషించనుంది.
నారాయణ్ సింగ్, సోనాక్షి సిన్హా తొలిసారి కలిసి చేయబోతున్న ఈ సినిమాకు ‘బుల్‌బుల్ తరంగ్’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. ఇందులో రాజ్ బబ్బర్, తాహిర్ రాజ్ బాసిన్ కీ రోల్స్ పోషించనున్నారు. సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘ఏజ్ – ఓల్డ్ కస్టమ్స్’(పాత తరహా ఆచారాల) అంశాన్ని తెరమీద చూపించనుంది. మార్చి- ఏప్రిల్‌లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ఈ ప్రాజెక్ట్‌ను నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక సోనాక్షి సిన్హా నటించిన ‘భుజ్ : ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’ కూడా త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుండగా.. అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ ‘ఫాలెన్’ ద్వారా సిన్హా ఈ ఏడాదే డిజిటల్ డెబ్యూ ఇవ్వనుంది.