వీడు కొడుకా మృగమా.. తల్లి మెడపై కత్తి పెట్టి మరీ అత్యాచారం.. వాటికి అలవాటు పడినందుకే?

by Anukaran |
వీడు కొడుకా మృగమా.. తల్లి మెడపై కత్తి పెట్టి మరీ అత్యాచారం.. వాటికి అలవాటు పడినందుకే?
X

దిశ, వెబ్‌డెస్క్ : కామంతో కళ్లుమూసుకుపోయిన కొందరు వావివరుసలను మర్చిపోతున్నారు. తల్లి బిడ్డా, అక్కా చెల్లి అని మానవ సంబంధాలను మరిచి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి దారుణాలకు ఒడిగట్టేందుకు ముఖ్యంగా మద్యమే మూల కారణంగా తెలుస్తో్ంది. ఈ క్రమంలోనే మద్యం, డ్రగ్స్ మత్తులో ఉన్న ఓ కీచక తనయుడు అతన్ని కనిపించిన తల్లిపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో తిల్లామోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూడగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

ఎస్పీ జ్ఞానేంద్ర సింగ్ కథనం ప్రకారం.. దీపావళి పండుగ నాడు అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా ఓ యువకుడు మద్యం, మత్తు పదార్థాలు తీసుకుని ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే పనిచేస్తున్న తన తల్లికి వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అందుకు ఆమె ప్రతిఘటించడంతో ఏకంగా మెడపై కత్తి పెట్టి బెదిరించి మరీ అత్యాచారం చేశాడు. దీపావళి పండుగ నాడు అనగా గురువారం రాత్రి కొడుకు తల్లిపై ఈ దారుణానికి ఒడిగట్టగా బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అంతకుముందు బాధితురాలు మాట్లాడుతూ.. తన భర్త కూడా మద్యం, డ్రగ్స్‌కు బానిస అయ్యి తనను వదిలేసి రాంపూర్ గ్రామానికి వెళ్లిపోయాడని, నాటి నుంచి ఏదో ఒక పనిచేస్తూ నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేసినట్టు పోలీసులకు వివరించింది. కానీ, తన కుమారుడి చేతిలోనే అత్యాచారానికి గురవుతానని కలలో కూడా ఊహించలేదని బాధిత మహిళ బోరున విలపించింది. ఇలా జరగడానికి తన కొడుకు మద్యం, డ్రగ్స్‌కు బానిస కావడమే కారణమని ఆ తల్లి వివరించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పంపించామని, ఆ తర్వాత నిందితుడిని మరుసటి రోజున అరెస్టు చేయగలిగామని ఎస్పీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed