- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దమ్ముంటే బద్వేలు అభివృద్ధిపై చర్చకు రండి : సోము వీర్రాజు
దిశ, ఏపీ బ్యూరో : బద్వేలు ఉపఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు, బెదిరింపులకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. బీజేపీ నేతలను బెదిరించి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని ధ్వజమెత్తారు. బద్వేలులో ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన వైసీపీ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని చెప్పుకొచ్చారు. కేంద్ర పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు జరుగుతాయని సోము వీర్రాజు చెప్పారు.
రాయచోటిలో ఇసుక మాఫియా చేస్తున్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.. బీజేపీపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. రాత్రి పగలు అని తేడా లేకుండా జేసీబీలు, ప్రొక్లైన్‌లతో ఇసుకను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికకు కేంద్ర బలగాలను కేటాయించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. బద్వేలులో భూ ఆక్రమణలు జరిగిన బాధితులకు అండగా ఉంటామని అన్నారు.
భూ ఆక్రమణలు జరిగిన వారందరికీ తిరిగి వారి భూములు ఇప్పిస్తాం. బద్వేలు నీటి సమస్యను పరిష్కారం చేస్తాం. ఇక బద్వేలులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక అభివృద్ధి మోడీ సొంతం. రాష్ట్రానికి వేల కోట్ల నిధులు కేంద్రం ఇచ్చింది. అభివృద్దే లక్ష్యంగా బీజేపీ పని చేస్తున్నది. ఇక్కడ అభివృద్ధిపై దమ్ముంటే బద్వేలు బీజేపీ అభ్యర్థితో చర్చకు శ్రీకాంత్ రెడ్డి రావాలని సోము వీర్రాజు సవాల్ విసిరారు.