ఎర్రగడ్డ మార్కెట్లో కూరగాయాలు ఎత్తుకెళ్లిన జనం

by Shyam |
ఎర్రగడ్డ మార్కెట్లో కూరగాయాలు ఎత్తుకెళ్లిన జనం
X

దిశ వెబ్ డెస్క్: కరోనా నేపథ్యంలో.. రేపు ఏం జరుగుతుందనన్న ఆందోళనలో ఉన్నారు. నిత్య అవసర వస్తువులు దొరుకుతాయో లేదో అన్నభయాందోళనకు గురవుతున్నారు. దాంతో పాటు.. కరోనా నేపథ్యంలో మార్కెట్లలో కూరగాయల ధరలు భారీగా పెంచేశారు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్‌లో కూరగాయల రేట్లు పెంచేయడంతో వాగ్వాదం జరిగింది. కొందరు వినియోగదారులు కూరగాయాలను లూటీ చేశారు.

కరోనా నేపథ్యంలో అంతటా కర్ఫ్యూ నడుస్తోంది. సంస్థలన్నీ లాక్ డౌన్ అయ్యాయి. నిత్య అవసరాలు తెరిచి ఉంచుతామని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. అయినా జనం రేపు ఏం జరుగుతుందో అని ఆందోళన చెంది.. ఒకేసారి అన్ని వస్తువులను తెచ్చుకుంటున్నారు. అదే విధంగా కూరగాయాలను కూడా భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో కూరగాయాల వర్తకులు కూడా వాటి రేట్లు బాగా పెంచేయడంతో వినియోగ దారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువ ధరలకు అమ్ముతున్న కొందరు వ్యాపారులపై వినియోగదారులు దాడికి దిగారు. మరోవైపు దీన్నే అదనుగా చేసుకున్న వినియోగదారులు ఎక్కడికక్కడ అందినకాడికి కూరగాయలు ఎత్తుకెళ్లారు. దీంతో ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించారు.

కూరగాయాల ధరలకు రెక్కలు

విజృంభిస్తున్నకరోనా వైరస్ ను కట్టడి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మార్చి 31వ తేది వరకు లాక్‌ డౌన్ విధించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న చిరు వ్యాపారులు నిత్యావసర ధరలను అమాంతం పెంచేసారు. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ధరలు పెరుగుతుండడంతో సామాన్య ప్రజానీకం ఆందోళన చెందుతోంది. రైతు బజార్ల ముందు, కిరాణా షాపుల ముందు భారీ ఎత్తున క్యూ కట్టారు. దీంతో షాపులు, రైతుల బజారులు, పెట్రోల్‌ బంకులు, పండ్ల, పూల మార్కెట్లు అన్నీ రద్దీగా మారిపోయాయి. మొన్నటి వరకు కిలో టమాటాలు 5 రూపాయలు ఉండగా, ఇప్పుడు ఏకంగా 50 దాటింది. కిలో మిరపకాయలు, 100, బెండకాయలు కిలో 80 అలానే మిగతా కూరగాయాల రెట్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి.

Tags: VEGETABLES, CORONA, THEFT, ERRAGADDA, RYTHU BAZAR.

Advertisement

Next Story