యువతిని మోసం చేసిన సోమాలి దేశస్థుడు

by Anukaran |   ( Updated:2020-11-05 02:50:08.0  )
యువతిని మోసం చేసిన సోమాలి దేశస్థుడు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ పాత బస్తీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో సోమాలి దేశస్థుడు ఓ యువతిని మోసం చేశాడు. డాక్టర్ అని చెప్పి ఆమెను పెళ్లాడాడు. అనంతరం ఆమెను తనతోపాటు సోమాలి తీసుకెళ్లాడు. గంపెడాశలతో భర్తతో కలిసి పొరుగు దేశం వెళ్లిన ఆ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె పెళ్లాడింది ఓ మోసగాడినని తేలింది. అతను డాక్టర్ కాదనే పచ్చినిజాన్ని తెలుసుకుంది. పైగా అతను లైంగికంగా వేధించడం కూడా ప్రారంభించడంతో పరాయి దేశంలో, ఆదుకోవడానికి నా అన్నవాళ్ళు లేక బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. టార్చర్ తాళలేక కుటుంబసభ్యులకు సెల్ఫీ వీడియో పంపడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది.

Advertisement

Next Story

Most Viewed