ఆయనలా నన్ను కూడా అభిమానించండి.

by Shyam |
ఆయనలా నన్ను కూడా అభిమానించండి.
X

దిశ, దుబ్బాక:
సోలిపేట రామలింగారెడ్డి మన మధ్యలో లేకపోవడాన్నిజీర్ణించుకోలేక పోతున్నానని , ఆయనను అభిమానించినట్టు నన్ను కూడా మీ మనసులో పెట్టుకోవాలని దుబ్బాక నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని సోలిపేట సుజాత అన్నారు. తాను గెలిచిన తరువాత రామలింగారెడ్డి ఆశయాలను నెరవేర్చుతానని ఆమె తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని మాచిన్ పల్లి ,ఇందుప్రియాల్ , అప్పయిపల్లి , శేరిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ నిర్వహించింది. ఈ సందర్భంగా తమ ఓట్లు అన్నీ టీఆరెస్ పార్టీకే అని శేరిపల్లి గ్రామ ప్రజలు ఏకగ్రీవ తీర్మానాన్ని టీఆర్ఎస్ అభ్యర్థిని సోలిపేట సుజాత కు అందించారు.

Advertisement

Next Story