- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లిప్‌కార్ట్‌లోకి సాఫ్ట్‌బ్యాంక్ భారీ పెట్టుబడులు..
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లోకి భారీగా పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ ఆసక్తి చూపిస్తోంది. దీనికి సంబంధించి 700 మిలియన్ డాలరు(రూ. 5 వేల కోట్లకు పైమాటే) పెట్టుబడులు పెట్టేందుకు ఫ్లిప్‌కార్ట్‌తో చర్చను జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ పెట్టుబడులు సాఫ్ట్‌బ్యాంక్ ఇదివరకు ప్రకటించిన విజన్ ఫండ్ 2.0 ద్వారా ఇన్వెస్ట్ చేసే 1.2-1-5 బిలియన్ డాలర్లలో భాగంగా ఉంటుందని తెలిపింది. ఈ పెట్టుబడుల ఒప్పందం జరిగితే ఫ్లిప్‌కార్ట్ విలువ 28 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. రాబోయే 3-4 నెలల్లో ఈ ఒప్పందం పూర్తవ్వొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదే సమయంలో ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్ చేసిన నాస్పర్స్, ప్రోసస్ వెంచర్స్ సహా ఇతర పెట్టుబడిదారులు ఫ్లిప్‌కార్ట్‌లో తమ వాటాలను పెంచుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా ఫ్లిప్‌కార్ట్ తన విలువను 30 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. రాబోయే ఏడాదిలోగా ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్‌కు రానుంది. ఐపీఓకు ముందే మరోసారి నిధుల సమీకరణకు వెళ్లే అవకాశం ఉంది. దీనికోసం జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్ శాక్స్‌లను నియమించుకుంది.