- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మతం సెంటిమెంట్‌తో సల్మాన్ ప్రమోషన్స్.. కడిగిపారేసిన యాక్ట్రెస్
దిశ, సినిమా: మోడల్, ఫార్మర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోఫియా హయత్ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌పై ఫైర్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ పోస్ట్ ద్వారా సల్మాన్ పరువు తీసేసింది. మూసధోరణిలో సినిమాలు చేస్తున్న సల్మాన్.. ఈద్ రోజున విడుదల చేస్తూ రిలీజియన్ సెంటిమెంట్‌ను ప్రమోషన్‌కు ఉపయోగించుకుంటున్నాడని తెలిపింది. ప్రతీసారి అదే సినిమా స్టోరీ, అదే స్టైల్, అదే అబ్బాయి అమ్మాయి ప్రేమకథతో వస్తున్న సల్మాన్‌ను చూసేందుకు ఆయన అభిమానులు కూడా విసుగుచెందారని అభిప్రాయపడింది. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారన్న ఆమె.. ‘రాధే’ ట్రైలర్‌ను చూస్తే ఇంతకు ముందే చూశాం కదా అనే అభిప్రాయం ప్రతీ ఒక్కరిలో వచ్చే ఉంటుందని చెప్పింది. అయినా ఎప్పుడూ కొత్త మోడళ్లను తీసుకునే బదులు ఏజ్‌కు తగిన అమ్మాయితో సినిమా చేయొచ్చు కదా అని సల్మాన్‌ను ప్రశ్నించింది.
రాధే సినిమాలో రణ్‌దీప్ హుడాను చూస్తే బాధేసిందన్న సోఫియా హయత్.. అంత మంచి నటుడికి స్క్రిప్ట్ చెండాలంగా రాసి అన్యాయం చేశారని తెలిపింది. కేవలం సల్మాన్‌తో కలిసి పనిచేశానన్న క్రెడిబిలిటీ కొట్టేసేందుకు మాత్రమే రణ్‌దీప్ ఈ సినిమాలో నటించి ఉంటాడన్న సోఫియా.. ఇండస్ట్రీలో కొంతమంది కేవలం ప్రతిష్ట కోసం మాత్రమే క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారని అభిప్రాయపడింది. బిగ్ బాస్ ఫైనల్ వేదికపై సల్మాన్ పక్కన కనిపించకూడదనే నిర్ణయం తీసుకున్నానన్న సోఫియా.. తన నైతికత, నిజాయితీ.. ఈగో కన్నా ఎక్కువ బలంగా ఉన్నాయని తెలిపింది.