సోషల్ మీడియాలో.. కరోనాపై ఫేక్ వార్తలు

by Shyam |
సోషల్ మీడియాలో.. కరోనాపై ఫేక్ వార్తలు
X

సోషల్ మీడియాలో.. ఎన్నో ఫేక్ వార్తలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. అయితే అదంతా వేరు.. కానీ ఇప్పుడు దేశం మొత్తం .. ఇంకా చెప్పాలంటే.. ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉంది. మనిషికి మనిషే ధైర్యం అందించాల్సిన తరుణమిది. ఇలాంటి ఆపత్కర సమయాల్లో ఫేక్ వార్తలతో ప్రజల్లో ఇంకా భయాందోళన రేకితిస్తున్నారు నెటిజన్లు. ఎప్పటివో… ఏనాటి ఫోటోలు, వీడియోలను .. కరోనా మరణాలకు, కరోనా భాదితులకు లింక్ చేస్తూ… సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి గ్రూపుల్లో తెగ వైరల్ అవుతూ.. ప్రజల్లో మరింత భయాన్ని సృష్టిస్తున్నాయి. ఆ వీడియోల్లో , ఫోటోల్లో నిజం ఉందో లేదో కూడా ఆలోచించకుండా.. చాలామంది వాటిని షేర్ చేస్తున్నారు. చదువుకున్నవాళ్లు, డిజిటల్ లిటరసీ ఉన్నోళ్లు కూడా .. ఆ ఫోటోలు, వీడియోలను ఫార్వార్డ్ చేయడం … సమంజసం కాదు. అందరి మొబైల్లో ఇంటర్నెట్ ఉండనే ఉంటుంది.. ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసి అందులో నిజం ఉందో లేదో తెలుసుకోవచ్చు. కానీ కనీస అవగాహాన లేకుండా ఫేక్ న్యూస్ ను ప్రమోట్ చేస్తూ… ప్రజల్లో మరింత భయాందోళనకు కారణమవుతున్నారు.

ఇప్పుడు ఎవరి నోట విన్నా.. ఒకటే మాట.. కరోనా.. కరోనా . గంట.. గంటకు బాధితుల సంఖ్య ఎంత పెరిగింది? ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చనిపోయారు? మన దగ్గర పరిస్థితి ఎలా ఉంది? పాజిటివ్ కేసులు పెరిగాయా? ఎవరైనా చనిపోయారా? ఈ ప్రశ్నల చుట్టూ మన రాష్ట్రం, దేశం, ప్రపంచమంతా తిరుగుతోంది. దీంతో చాలా మంది భయబ్రాంతులకు గురవతున్నారు. రేపటి వరకు ఉంటామా? పోతామా? అని భయపడుతున్నారు. ఇలాంటి సమయాల్లో వారికి కావాల్సింది ధైర్యం. మనమంతా ఆ కరోనా మహమ్మారిని ఎదురించి.. జయిస్తామన్న భరోసా. మనమంతా ఇంటికే పరిమితమై, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సూచనలు పాటిస్తే… ఆరోగ్యంగా ఉండటమే కాదు.. మన భావి తరాలకు కూడా మంచి భవిష్యత్తును ఇచ్చిన వాళ్లమవుతాం. బార్డర్ లో నిలబడకుండానే… దేశాన్ని రక్షించే అవకాశం వచ్చింది. తుపాకులు ఎక్కుపెండుకుండానే, శత్రువును మన చేతులతో చంపకుండానే.. గెలిచే అవకాశం మనకు వచ్చింది. ఇలా వాళ్లకు రేపటి పై నమ్మకం అందిస్తూ.. దే శభక్తిని చాటే నాలుగు మాటలు కావాలి. అంతే కానీ భయపడుతున్న వారిని మరింత భయపెట్టే ఫేక్ ఫోటో, వీడియోలను పోస్ట్ చేయడం కాదు. ఈ ఫేక్ వార్తల్లో ప్రధానంగా ఇటలీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. ఇటలీలో ఇప్పటివరకు 74, 386 కేసులు నమోదు కాగా, 7, 503 మంది చనిపోయారు. 3, 489 మంది ఇంకా సీరియస్ కండిషన్ లో ఉన్నారు.

రష్యాలో పుతిన్ ఏం చేశాడంటే..

ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని ప్రభుత్వం మొత్తుకున్నా.. ప్రజలు వినడం లేదని, జనాన్ని ఇళ్లకే పరిమితం చేసేందుకు రష్యా ప్రభుత్వం రోడ్ల మీద సింహాలను వదిలింది. ఇదో ప్రచారం.

ఏదీ నిజం:
శాటిలైట్‌ తీసిన ఫొటోలకు ఇటలీలో కరోనా మరణాలకు ఎలాంటి సంబంధం లేదు. నాజీల క్రూర చర్య కారణంగా మృతిచెందిన వారి స్మారకార్థం నిర్వహించిన ఓ ఆర్ట్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫొటోలు అవి.

కరోనా మరణాలు ఆగకపోవడంతో… దానికి బాధ్యత వహిస్తూ.. ఇటలీ అధ్యక్షుడు కన్నీళ్లు పెడుతున్నాడంటూ.. వైరల్ అవుతున్న ఆ వ్యక్తి ఫొటో అసలు ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాటెరెల్లాది కానేకాదు. ఆ ఫొటో బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారోది. పైగా ఆయన రోదనకు కరోనా విపత్తుకు సంబంధమే లేదు.

ఇక వీడియో కు సంబంధించి:
విమానం ప్రమాదం సంభవిస్తే… ఎలా వ్యవహరించాలి, ఎలా తమ ప్రాణాలను కాపాడుకోవాలో… తెలియజేస్తూ.. కొంతమంది ఐటీ ఉద్యోగులకు .. మాక్ డ్రిల్ నిర్వహించిన వీడియో అది.
మరో వీడియోలో… కరోన కారణంగా మరణించిన వ్యక్తులను ప్రోక్లీన్ తో ఒక పెద్ద గోతిలో పడేస్తారా? అది కూడా కరోనా మరణాలకు సంభందం లేని వీడియోనే.

రోడ్లపై సింహాలు:

ఒక దేశాధ్యక్షుడు తన ప్రజలను భయపెట్టడానికి సింహాలను రోడ్లపై వదులుతాడా? అగ్రదేశమైన రష్యాలో పోలీసులు లేరా? అవసరమైతే మిలటరీ రాదా? అని కనీసం ఆలోచించకుండా ఫొటోను షేర్‌ చేస్తున్నా రు. జనారణ్యంలోకి సింహాలు వచ్చినట్లుగా మార్పింగ్‌ చేసిన ఫొటోలవి.

ఒక్కసారి మనకు ఏదైనా ఫోటోనో, వీడియోను వస్తే.. రెండు నిముషాలు ఆలోచించి… ఒక్కసారి గూగుల్ లో సెర్చ్ చేస్తే.. దాని వివరాలన్నీ తెలుస్తాయి. ఫేక్ న్యూస్ షేర్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన తరుణమిది.

Tags : CORONAVIRUS, FAKE , NEWS, DEATH, ITALY, LION, PRESIDENT, SOCIAL MEDIA, WHATSAPP

Advertisement

Next Story