- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐస్‌లాండ్‌ను పాడుచేస్తున్న ‘సోషల్ మీడియా’
దిశ, వెబ్‌డెస్క్:
ఒక దశాబ్ధం క్రితం ఐస్‌లాండ్‌కి పెద్దగా టూరిస్టులు వచ్చేవారు కాదు. వచ్చిన కొద్దిమంది కూడా చాలా ఆనందంగా గడిపి వెళ్లేవారు. కానీ ఇన్‌స్టాగ్రాంలో ఎప్పుడైతే ఐస్‌లాండ్ అందచందాలు పాపులర్ అయ్యాయో ఇక అప్పట్నుంచి ఆ దేశం టూరిస్టులతో కిక్కిరిసి పోయింది. టూరిస్టులు వచ్చి చూసి ఆనందించి వెళ్లిపోతే బాగానే ఉండు.. కానీ వారి ఇన్‌స్టా లైవ్‌లు, ఫొటోలు, ఫిల్టర్ల కారణంగా పర్యటన మాధుర్యం దెబ్బతినడమే కాకుండా సందర్శక స్థలాలు కూడా నాశనమవుతున్నాయి. ఒకానొక సమయంలో ఐస్‌లాండ్ ప్రభుత్వం ఇన్‌స్టాగ్రామర్లు చేస్తున్న పని సిగ్గు లేనిదని నోటీసులు కూడా జారీ చేసింది.
అవును.. నిజంగా సిగ్గులేని పనే… రోజువారీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటారు. కనీసం కొద్దిరోజులు ఆనందంగా గడపడానికి పర్యటనకు వస్తారు. ఆ సమయాల్లో కూడా ఇలా ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లు అంటూ అసలైన ఆనందాన్ని కోల్పోవడం ఎందుకని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సోషల్ మీడియా ప్రభావ చేష్టల గురించి ఎక్స్‌పీడియా అనే ట్రావెలింగ్ సంస్థ ఒక నివేదిక కూడా విడుదల చేసింది. అందులో 60 శాతం మంది ట్రావెలర్లు వెకేషన్ ఫొటోలను దిగిన వెంటనే షేర్ చేస్తున్నారని ఉంది. అంతేకాకుండా మామూలు సమయాల కంటే వెకేషన్‌లో ఉన్నపుడే 25 శాతం మంది సోషల్ మీడియాను ఎక్కువ ఉపయోగిస్తున్నారని, 40 శాతం మంది బ్రిటన్ దేశీయులు ఇన్‌స్టాగ్రాం పాపులారిటీని బట్టి పర్యాటక ప్రాంతం ఎంచుకుంటున్నారని నివేదిక వెల్లడించింది. ఇక మరోవైపు సందర్శనలో ఉన్నపుడు సెల్ఫీలు పోస్టు చేసినపుడు వారి కాన్ఫిడెన్స్ పెరుగుతోందని కొందరు అంటుండంగా, 44 శాతం మంది మాత్రం సోషల్ మీడియా వల్ల తమ ఫ్యామిలీ ట్రిప్ వేస్ట్ అయ్యిందని బాధపడుతున్నారు. ఏదేమైనా పర్యటన ఎంజాయ్ చేయాలంటే ఫోన్ పక్కకి పెడితేనే సాధ్యమని విశ్లేషకులు అంటున్నారు.
Tags: Social media, Instagram, Facebook, Tourist, Iceland, Ruined trip, Family trip, Selfies, Live videos