చిన్నారుల్లో ఒత్తిడికి టీవీ, సోషల్ మీడియా కారణమా?

by Shyam |
చిన్నారుల్లో ఒత్తిడికి టీవీ, సోషల్ మీడియా కారణమా?
X

దిశ, ఫీచర్స్ : స్మార్ట్ ‌ఫోన్స్, గాడ్జెట్స్ వాడకం పెరిగినప్పటి నుంచి చిన్నారులు కూడా ఎక్కువ టైమ్ అందులోనే స్పెండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఇంట్లోనూ ఇదే సమస్య. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నా ఫలితమాత్రం శూన్యం. టీవీ ముందు గంటలగంటలు గడపకుండా నైంటీస్ చిన్నారులను ఆపడానికి అప్పటి పేరెంట్స్ చేసిన భగీరథ ప్రయత్నంతో పోల్చితే ఇప్పటి తల్లిదండ్రుల పరిస్థితి మరీ దారుణం. ఈ క్రమంలోనే సోషల్ మీడియా, టీవీ రెండూ పిల్లల మానసిక ఆరోగ్యానికి ఈక్వల్‌గా హానికరం చేస్తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

UK, USలో నివసిస్తున్న మొత్తం 4,00,000 మంది యువకులు పాల్గొన్న మూడు పెద్ద సర్వేలను పరిశీలించిన ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు.. వ్యక్తిగత సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వారు ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సమస్యలపై అధ్యయనం చేశారు. ఈ డేటా ఆధారంగా మానసిక ఆరోగ్య ఫలితాన్ని కనుగొన్నారు. టెలివిజన్, సోషల్ మీడియా రెండింటినీ వినియోగించడం వల్ల కాలక్రమేణా మానసికి ఒత్తిడి పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు.

‘సోషల్ మీడియా వాడకం, భావోద్వేగ సమస్యల మధ్య కొన్ని పరిమిత అనుబంధాలను మేము కనుగొన్నాం. అయితే అవి ఎందుకు సంబంధం కలిగి ఉన్నాయో తెలుసుకోవడం చాలా కష్టం. ఇందుకు అనేక ఫ్యాక్టర్స్‌ దోహదపడొచ్చు. అయితే గత దశాబ్దంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, పరికరాల్లో వేగంగా మార్పులు టీనేజ్ పిల్లల్లోని మానసిక ఆరోగ్యానికి మరింత హాని కలిగిస్తాయనే వాదన ప్రస్తుత డేటాకు బలంగా మద్దతు ఇవ్వదు. స్వతంత్ర పరిశోధకులు, సాంకేతిక సంస్థలు మాకు సహకరిస్తే ట్రాన్స్‌పరెంట్ రీసెర్చ్ రిజల్ట్ వస్తాయి. కానీ సోషల్ మీడియా వాడకం చిన్నారులు, యువతలో డిప్రెషన్ పెరగడానికి కారణమవుతుండటంతో పాటు మానసికంగానూ వారిని క్రుంగదీస్తోంది.
– డాక్టర్ వూరే, లీడ్ ఆథర్ ఆఫ్ ది స్టడీ

Advertisement

Next Story