సోషల్ మీడియా చేసిన పెళ్లి.. ఇంట్రెస్టింగ్ స్టోరీ

by Sujitha Rachapalli |   ( Updated:2021-03-23 04:27:55.0  )
సోషల్ మీడియా చేసిన పెళ్లి.. ఇంట్రెస్టింగ్ స్టోరీ
X

దిశ, ఫీచర్స్ : ప్రజెంట్ సొసైటీలో పిల్లల నుంచి వృద్ధుల వరకు దాదాపు అందరికీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉండటం కామన్ అయిపోయింది. e-జనరేషన్‌తో పోటీ పడి మరీ పెద్దలు, దివ్యాంగులు కొత్త టెక్నాలజీని యూజ్ చేయడం తెలుసుకుంటున్నారు. రకరకాల పోస్టులు పెడుతూ తమను తాము ఎక్స్‌ప్లోర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు దివ్యాంగులకు పెళ్లి చేసింది సోషల్ మీడియా. అదెలాగో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఒడిషాలోని సంబ్లాపూర్‌కు చెందిన 43 ఏళ్ల లక్ష్మిరాణి త్రిపాఠి, జార్ఖండ్‌కు చెందిన 48 ఏళ్ల మహబీర్ ప్రసాద్ శుక్లా ఇద్దరూ పుట్టుకతోనే చెవిటి, మూగ. వీరికి తగిన జోడీ దొరక్కపోవడంతో ఇన్నేళ్లుగా వారి పెళ్లి కాలేదు. కుటుంబీకులు కొన్ని సంబంధాలు చూసినప్పటికీ వైకల్యం వల్ల అవతలి వారు తిరస్కరించడంతో ఇద్దరూ బ్యాచిలర్స్‌గానే ఉన్నారు. ఇక జీవితాంతం అలానే మిగిలిపోతారనుకున్న సమయంలో సోషల్ మీడియా వారి జీవితంలో మార్పు తెచ్చింది.

ఇటీవల కాలంలో లక్ష్మిరాణి, మహబీర్ ప్రసాద్ ఫేస్‌బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారు. ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తున్న క్రమంలో.. వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయడంతో వీరి లవ్ స్టోరి షురూ అయింది. ఇద్దరికీ వినపడదు, పైగా మాట్లాడలేరు. అయినా తమ ప్రేమను సైన్ లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్రెస్ చేసుకున్నారు. ఫేస్‌బుక్ మెసెంజర్ మెసేజ్‌తో పాటు వాట్సాప్ వీడియో కాల్స్‌లో ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఇద్దరి వైకల్యాలు సేమ్ కాబట్టి వారి మధ్య ప్రేమ మరింత బలపడినట్లుంది. ఇరువురి కుటుంబీకులు వీరి ప్రేమను అంగీకరించడంతో ఇటీవలే వారి పెళ్లి జరిగింది.

‘లక్ష్మిరాణికి పార్ట్‌నర్‌ను మేం వెతకలేకపోయామని దేవుడే ఓ వ్యక్తిని సోషల్ మీడియా ద్వారా ఆమెకు పరిచయం చేసినట్లున్నాడు. మేం ఈ సంబంధం చూసి చాలా ఆనందంగా ఫీలవుతున్నాం’ అని నూతన వధువు కుటుంబీకులు తెలిపారు. కాగా సోషల్ మీడియా కమ్యూనికేషన్ గ్యాప్‌ను భర్తీ చేస్తోందని, రా టాలెంట్‌ను ప్రపంచానికి తెలిసేలా చేస్తోందని, ఇది మంచి పరిణామమేనని సోషల్ మీడియా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed