- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పులను ప్రశ్నించే గొప్ప వేదిక సోషల్ మీడియా – బండారు దత్తాత్రేయ
by Shyam |
X
దిశ, ఖైరతాబాద్ : ప్రభుత్వాలు చేసే తప్పు ఒప్పులను ప్రశ్నించే గొప్ప వేదిక సోషల్ మీడియా అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన సోషల్ మీడియా మంత్ర యాప్‌ను ఆయన ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, సమాజానికి నిర్మాణాత్మకమైన విషయాలను చెప్పడంలో ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని అన్నారు. ఇదే సమయంలో రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో అప్డేట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఇలాంటి సోషల్ మీడియా లు యువ నాయకులను తయారు చేసేందుకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ మంత్రులు విజయరామారావు, చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే శ్రీ రాములు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story