- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజ్యసభలోనూ భౌతిక దూరం
న్యూఢిల్లీ: వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ సభ్యులు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయనున్నారు. అందుకు అనుగుణంగా సభలో సీటింగ్ అరేంజ్ చేయనున్నట్టు తెలిసింది. కరోనా జాగ్రత్తలు పాటించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సంబంధిత అధికారులను ఆదేశించినట్టు సమాచారం. రాజ్యసభ అధికారవర్గాల సమాచారం ప్రకారం, సభ్యులందరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ చర్చల్లో పాల్గొనడానికి చాంబర్ సహా అన్ని గ్యాలరీల సీట్లను వినియోగించనున్నారు. మీడియా గ్యాలరీ మినహా మిగతా సీట్లన్నీ సభ్యులకు కేటాయించనున్నారు.
సామాజిక దూరానికి అనుగుణంగా సీట్లను అరేంజ్ చేస్తే 127 మందికి మాత్రమే సరిపోతాయి. ఈ పక్షంలో మిగతా సభ్యులకోసం సెంట్రల్ హాల్ లేదా బాలయోగి ఆడిటోరియాన్ని వినియోగించనున్నారు. అలాగే, మిగతా సభ్యుల వాదనలూ వినేందుకు, చూసేందుకు చాంబర్ హౌజ్ లోపలా, వెలుపలా స్క్రీనింగ్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. లేదా మరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని చైర్మన్ సూచించినట్టు సమాచారం అందింది. కొశ్చన్ అవర్, ప్రమాణ స్వీకారం, సభ్యుల ప్రయాణ ఏర్పాట్లు, సామాజిక దూరం, శానిటైజేషన్‌లపైనా చైర్మన్ వెంకయ్యనాయుడు చర్చించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.