సామూహిక దూరమే కరోనాకు సరైన మందు

by Shyam |   ( Updated:2020-03-28 23:49:57.0  )
సామూహిక దూరమే కరోనాకు సరైన మందు
X

దిశ, మహబూబ్ నగర్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు పరిశుభ్రత పాటించడంతోపాటు సామూహిక దూరం పాటించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం వనపర్తి జిల్లా కేంద్రంలో పర్యటించారు. రైతుబజార్‌, మార్కెట్ యార్డ్‌, బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల మార్కెట్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రజలు నిత్యావసర సరుకులకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వమే అన్నిరకాల ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. కూరగాయలు కొనేవారు సామూహిక దూరం పాటించాలని సూచించారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వైద్యారోగ్య, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది నిరంతరాయంగా శ్రమిస్తున్నారన్నారు. ప్రజలంతా కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, కౌన్సిలర్లు బండారు కృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి , సీఐ సూర్యనాయక్ తదితరులు ఉన్నారు.

tags;social distance must be followed,minister singireddy niranjan reddy, People should follow

Advertisement

Next Story

Most Viewed