- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఇది నా కోరిక : శోభిత
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళకు సినిమాల పట్ల ఉన్న ప్రేమ, అభిమానం గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. చదవడం, రాయడంతో పాటు వాటిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి ఇష్టపడుతుంది. దాదాపు 8 ఏళ్ల సినీ ప్రయాణంలో చాలా మంది ప్రతిభ గల వ్యక్తులను చూశానని చెప్తోన్న తను.. దేశంలో టాలెంట్‌కు కొదవలేదని అర్థమైందని తెలిపింది. భిన్న మనస్థత్వాలు, విభిన్న వయసున్న వ్యక్తులు, వ్యక్తిత్వాలు, కెరీర్లు చాలా చూశానని, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎదగడాన్ని గమనించానని చెప్పింది.
ఇప్పటి వరకు తన ప్రయాణంలో అధికారం కోసం పాకులాడామని, కానీ లాక్‌డౌన్ టైమ్.. తనలో ఉన్న నెగెటివ్ ఆలోచనల నుంచి విముక్తి కలిగించిందని చెప్పింది. అందుకే తానో కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది. ‘క్రియేటివ్ స్టూడియో లేదా మరొక పేరు.. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ నేను మాత్రం సినిమాల కోసం కథలు సృష్టించాలని అనుకుంటున్నా’ అని తెలిపింది. ఒక కమ్యూనిటీలా అందరం కలిసి ఎదగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. మీ దగ్గర ఎలాంటి కథలు, ఆలోచనలు, స్క్రిప్ట్ ఉన్నా తనతో నేరుగా పంచుకోవచ్చని తెలిపింది. తనకు మెయిల్ చేయడం ద్వారా మంచి అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పింది. ఇది చాలా కాలంగా తనలో ఉన్న పవిత్రమైన కోరికగా అభివర్ణించింది శోభిత.
ఈ ప్రకటనతో ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు అందుకుంటోంది శోభిత. గొప్ప చొరవ తీసుకుని.. గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నశోభితకు కంగ్రాట్స్ చెప్తున్నారు.
Read also…