- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇది ప్రేమ కాకపోతే మరేంటి? శోభిత ఎమోషనల్ వీడియో
దిశ, సినిమా: ‘మెడికల్ రీసోర్సెస్ గురించి గైడ్ చేసేందుకు రాత్రంతా మేల్కొనే నిఖిల్.. కరోనా పేషెంట్లను తన ఆటోలో ఫ్రీగా హాస్పిటల్‌కు తరలించే జావేద్ భాయ్.. ఆపదలో ఉన్న ఇతరులకు ఆక్సిజన్ సిలిండర్లు అందించేందుకు తన కారు, బైక్ అమ్మేందుకైనా సిద్ధపడే ఓ యువకుడు.. మేలో ఎండలు మండుతున్నా సరే తమ పేషెంట్లను కాపాడుకునేందుకు15 గంటల పాటు పీపీఈ కిట్లు ధరిస్తున్న డాక్టర్లు, నర్సులు.. కష్టాల్లో ఉన్న వారికి ఉచితంగా భోజనం అందించే మానవతావాదులు.. ఒకరినొకరు చూడలేదు, కలవలేదు.. కానీ ఆపత్కాలంలో సహాయం చేసేందుకు ముందుకొచ్చారు.. ఇది ప్రేమ కాదంటారా?’ అని గర్వంగా చెప్తోంది హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల.
ఈ పరిస్థితుల్లో అందరూ అలిసిపోయినా మిగిలి ఉన్న మానవత్వం మాత్రం సహాయకార్యక్రమాలను కొనసాగిస్తోందని తెలిపింది. ఉదయం లేవగానే కేసుల సంఖ్య చూస్తే భయమేస్తోందని, వ్యాక్సిన్ కోసం వేల మంది లైన్లలో నిల్చుంటున్నారన్న శోభిత.. ఇది కఠినమైన పరిస్థితి అని అభిప్రాయపడింది. కానీ దీనికన్నా మనందరి సమిష్టి సంకల్పమే మరింత గొప్పదని తెలిపింది. ప్రతీ వ్యాక్సిన్ డోస్ ఎలాగైతే బ్రతుకుమీద ఆశలు చిగురింపజేస్తుందో.. అలాగే అపరిచితులతో ఇలా కలిసిపోయిన ప్రేమ బంధం చీకట్లో వెలుగునిస్తోందని చెప్పింది.
All heart 🙂 @OkcupidIndia pic.twitter.com/v9sTnEtEjS
— Sobhita Dhulipala (@sobhitaD) May 13, 2021