- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనూ మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా : స్మృతి ఇరానీ
వలస కూలీల పాలిట దేవుడిగా మారిన సోనూసూద్.. రియల్ హీరోగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. లాక్‌డౌన్‌లో భాగంగా ఎంతోమంది వలస కూలీలు కాలినడకన తమ స్వస్థలాలకు బయలుదేరిన విషయం తెలిసిందే. ఇలాంటి క్లిష్ల సమయంలో సోనూసూద్ వలస కూలీలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ‘వాళ్లు మన ఇళ్లు కట్టడానికి వాళ్ల ఇళ్లను వదిలిపెట్టి వచ్చారు. వాళ్లనలా చూస్తుంటే.. మనుషులుగా మనందరం ఫెయిల్ అయ్యామని అన్పిస్తుంటుంది. ఆఖరి కార్మికుడు ఇంటికి చేరే వరకు ఈ సాయం చేస్తూనే ఉంటా’ అని సోనూసూద్ పేర్కొన్నారు. కాగా సోనూ చేస్తోన్న పనులకు ఎంతోమంది నుంచి ప్రశంసలు అందుతుండగా.. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా సోనూ సేవలను కొనియాడారు.
ముంబైలోనే కాకుండా జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్‌లలో చిక్కుకుపోయిన అనేక మందిని వారి స్వస్థలాలకు పంపేందుకు సోనూసూద్ సాయపడ్డారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ట్విట్టర్ వేదికగా సోనూసూద్‌ను సాయంచేయాలని కోరాడు. ‘సర్ మీరు ఏదైనా వాహనాన్ని ఏర్పాటు చేసి ఉత్తర్ ప్రదేశ్‌లోని ఏ ప్రాంతానికైనా పంపించండి. అక్కడి నుంచి నడుచుకుంటూ మా ఊరికి వెళ్తాను’ అని సోనూకు ట్వీట్ చేశారు. ‘నడుచుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఏముంది. మీ ఫోన్ నెంబర్ పంపించండి’ అని సోనూ రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే స్మృతి ఇరానీ సోనూపై ప్రశంసలు కురిపించారు. “ మీ గురించి నాకు తెలుసు. రెండు దశాబ్దాలు ప్రొఫెషనల్‌గా మీతో కలిసి పనిచేసే అదృష్టం నాకు దక్కింది. నటుడిగా చాలా ఎదిగారు. ప్రస్తుతం కష్టకాలంలో మీరు చేస్తున్న సాయం ఇప్పటికీ నన్ను గర్వపడేలా చేస్తోంది. మీవంతు సాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు” అని స్మృతి ఇరానీ అన్నారు.