బ్రహ్మణపల్లిలో స్మితాసబర్వాల్.. వైద్యశాఖకు కీలక ఆదేశాలు

by Shyam |   ( Updated:2021-09-03 02:49:57.0  )
బ్రహ్మణపల్లిలో స్మితాసబర్వాల్.. వైద్యశాఖకు కీలక ఆదేశాలు
X

దిశ, మంగపేట : బ్రాహ్మణపల్లి ఆసుపత్రిలో మహిళల కాన్పుల కొరకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎంఓ స్మితా సబర్వాల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్యను ఆదేశించారు. శుక్రవారం భద్రాచలం పర్యటన నుండి మంగపేట మీదుగా వెళ్తున్న స్మితా సబర్వాల్ బృందం మండలంలోని బ్రాహ్మణపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. బ్రాహ్మణపల్లి నుండి ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రి 30 కిలోమీటర్లు. జిల్లా కేంద్రం ఆసుపత్రి 80 కిలో మీటర్ల దూరం ఉన్నందున గర్బవతులు అత్యవసర వేళల్లో ఇబ్బంది పడే అవకాశాలున్నందున ఇక్కడే డెలివరీ చేసేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించిన స్మితా సబర్వాల్ సిబ్బంది, మందుల కొరత తదితర అంశాలను వైద్యురాలు మంకిడి ట్వంకిల్ నిఖిత నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలలో పంట పొలాలున్నందున పాములు, విష కీటకాలు చేరే అవకాశమున్నందున యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రి చుట్టూ ట్రెంచ్ పనులు చేయించాలని అప్పయ్యను ఆదేశించారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి వాకాటి కరుణ, మహిళ ,శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ దివ్యరాజన్, తెలంగాణ హరితహారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్, రాష్ట్ర ఐఏఎస్ మహిళా అధికారులు క్రిస్టీనా జడ్ చోంగ్తూ, వాకాటి కరుణ, దివ్య, ప్రియాంక బృందం భద్రాచలం ఐటీడీఏ అధికారి గౌతమ్ పోత్రు, జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story