- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరీంనగర్ బనేగా స్మార్ట్ : గంగుల
దిశ, కరీంనగర్: అర్హత లేకున్నా నగరం మీద ఉన్న ప్రేమతో సీఎం కేసీఆర్ కృషి వల్లే కరీంనగర్ కు స్మార్ట్ సిటీ హోదా వచ్చిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత 19నెలలకు హైద్రాబాద్‌లో మొదటి సమావేశం జరిగిందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా నగరంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. జిల్లాలో కొత్తగా ఐదు పనులకు పరిపాలన పరమైన ఆమోదం లభించిందన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షకు వెలుతుండగా ఆయన్ను అరెస్ట్ చేసిన అలుగునూర్ వద్ద ఐలాండ్ నిర్మించనున్నట్టు మంత్రి గంగుల వివరించారు. మానేరు రివర్ ఫ్రంట్‌కు తోడుగా కుడి వైపు నాలుగున్నర కిలోమీటర్ల నిడివిలో మానేరు రివర్ బండ్ కూడా అభివృద్ధి చేస్తామని, ఇందుకు రూ. 100కోట్లు వెచ్చించనున్నామని, చేగుర్తి వరకు 5 చెక్ డ్యాములు నిర్మించనున్నట్టు ప్రకటించారు. మూడు జోన్లలో 24 గంటల పాటు తాగు నీటి సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ నిర్మాణం కూడా చేపడుతామని మంత్రి చెప్పుకొచ్చారు. కరీంనగర్‌లో ఈ బస్ నడిపేందుకు డీపీఆర్ తయారు చేస్తున్నామని, చారిత్రాత్మక కట్టడాల రక్షణకు రూ.3.2 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. సాలీడ్ వెస్ట్ మేనేజ్ మెంట్ కోసం రూ.66కోట్లతో ప్రత్యేక ప్రణాళికలు తయార చేస్తున్నామన్నారు.ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం రూ.5.6కోట్లతో పనులు చేపట్టడమే కాకుండా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. స్మార్ట్ సిటీ పనుల్లో వరంగల్ కంటే కరీంనగరే ముందంజలో ఉందన్నారు. కరోనా కట్టడిలో నగరపాలక సంస్థ చేపట్టిన చర్యలు బాగున్నాయని మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారని స్పష్టంచేశారు. నగరంలో పెండింగ్‌లో ఉన్న యుజీడీ పనులను వెంటనే పూర్తి చేయాలని కేటీఆర్ ఆదేశించారని..ఈ మేరకు చర్యలు తీసుకోనున్నట్టు గంగుల తెలిపారు.