చెర్రీ సారీ… జక్కన్న వల్లే ఇదంతా? : తారక్

by Shyam |
చెర్రీ సారీ… జక్కన్న వల్లే ఇదంతా? : తారక్
X

దిశ, వెబ్‌డెస్క్: RRR (రౌద్రం రణం రుధిరం ) మూవీ … యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ కొమురం భీంగా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న సినిమా అప్ డేట్స్ గురించి వెయిట్ చేసిన అభిమానులకు ఉగాది కానుకగా మోషన్ పోస్టర్, టైటిల్ లోగోను అందించింది మూవీ యూనిట్. అయితే శుక్రవారం మార్చి 27న చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ ట్రీట్ ఇద్దామని అనుకున్నారు. అదే విషయాన్ని ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు కూడా. భీమ్ ఫర్ రామరాజు పేరుతో నీకు అమేజింగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం చరణ్ అంటూ తెలిపాడు. కానీ… మళ్లీ ‘సారీ చెర్రి’ అంటూ ట్వీట్ చేశాడు తారక్. నీకు ఇవ్వాలనుకున్న గిఫ్ట్‌ను జక్కన్నకు పంపించాను .. నీకు తెలుసు కదా ఆయన సంగతి? కొంచెం ఆలస్యం అవుతుంది అంటూ పోస్ట్ పెట్టాడు. దీనికి రిప్లై ఇచ్చిన చెర్రీ… ఏంటీ ఆయనకు పంపించావా? నాకు బర్త్ డే గిఫ్ట్ ఈ రోజు వస్తుందా? లేదా? అని చమత్కరించాడు. ఇక చరణ్ బర్త్ డే గిఫ్ట్ కోసం అందరం వెయిట్ చేస్తున్నామంటూ ట్వీట్ చేశాడు చిరు. దీనికి రిప్లై ఇచ్చిన డైరెక్టర్ రాజమౌళి.. సార్.. అంటే… అది… కొంచెం… కొంచెమే.. యాక్చువల్‌గా… ప్లీజ్… సార్ అంటూ ట్వీట్ చేశాడు.

దీంతో చెర్రీకి వచ్చే సర్‌ప్రైజ్ గురించి వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. ఇంతకీ ఈ రోజు ఆ ట్రీట్ వస్తుందా? లేదా? అని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తూనే.. తారక్, చెర్రీ, చిరు, జక్కన్నల మధ్య జరిగిన సంభాషణను ఎంజాయ్ చేస్తున్నారు. #BheemForRamaraj హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.


Tags: RRR, NTR, RamCharan Tej, BheemForRamraj, Chiranjeevi, SSRajamouli

Advertisement

Next Story