- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండస్ఇండ్ నుంచి రూ. 74 కోట్లు అందుకున్న కినారా కేపిటల్!
దిశ, వెబ్‌డెస్క్: చిన్న వ్యాపారుల క్రెడిట్ సవాళ్లను తగ్గించేందుకు ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి సుమారు రూ. 74 కోట్ల నిధులను సాధించినట్టు చిన్న వ్యాపారాలకు రుణాలందించే ఆర్థిక సేవల సంస్థ కినారా కేపిటల్ ప్రకటించింది. ఇది యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(డీఎఫ్‌సీ) నుంచి 100 శాతం హామీతో లభించినట్టు కంపెనీ పేర్కొంది. ఈ మొత్తం రూ. 100 కోట్ల రుణ, ఈక్విటీ రౌండ్‌లలో భాగమని, కినారా ప్రస్తుత పెట్టుబడిదారులైన గజా కేపిటల్, గావా కేపిటల్, మైఖేల్ అండ్ సుసాన్ డెల్ ఫౌండేషన్, పటమర్ కేపిటల్ నుంచి ఈక్విటీ సహకారం అందుతున్నట్టు కినారా కేపిటల్ ఓ ప్రకటనలో తెలిపింది.
‘ఈ పెట్టుబడులను దేశీయంగా తయారీ, వాణిజ్య, సేవల రంగాల్లోని ఎంఎస్ఎంఈల విస్తరణకు వినియోగించనున్నట్టు’ కంపెనీ పేర్కొంది. కినారా కేపిటల్ 56 వేల చిన్న వ్యాపారులకు సుమారు రూ. 2,000 కోట్లను పంపిణీ చేసింది. ‘ఇండస్ ఇండ్, డీఎఫ్‌సీతో తమ భాగస్వామ్యం దేశీయంగా ఉన్న చిన్న వ్యాపారులు ఎదుర్కొంటున్న క్రెడిట్ సవాళ్లను తగ్గించడానికి వీలవుతుంది. దేశ ఆర్థికవ్యవస్థను మెరుగుపరచడంలో చిన్న వ్యాపారులు కీలక పాత్రను పోషిస్తున్నాయి. వీరి నుంచి ఆదాయ ఉత్పత్తి, ఉద్యోగాల కల్పన, గ్యారెంటీ లేని రుణాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని’ కినారా కేపిటల్ వ్యవస్థాపకుడు, సీఈఓ హర్ధికా షా చెప్పారు. ఇండస్ఇండ్ బ్యాంక్, డీఎఫ్‌సీల నుంచి లభించే పెట్టుబడులతో చిన్న వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని ఆమె వెల్లడించారు.