అతడితో పెళ్లి కాకుండానే ప్రెగ్నెంటైన స్టార్ హీరోయిన్.. ఫోటోలు వైరల్

by Jakkula Samataha |   ( Updated:2021-06-29 00:58:42.0  )
freida pinto pragnency news
X

దిశ, వెబ్‌డెస్క్: ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్ ఫ్రిదా పింటో. ఈ సినిమా తరవాత ప్రపంచమంతా క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ త్వరలో తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రియుడు కోరీ ట్రాన్‌తో 2017 నుండి డేటింగ్‌లో ఉన్న ఈ అమ్మ‌డు 2019లో అత‌నితో నిశ్చాత‌ర్థం జ‌రుపుకున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఆ తర్వాత పెళ్లి ఊసే ఎత్తని ఫ్రిదా సడెన్ గా తల్లి కాబోతున్నట్లు ప్రకటించి షాక్ కి గురి చేసింది.

తన సోషల్ మీడియాలో ప్రియుడు కోరీ ట్రాన్‌తో కలిసి, బేబీ బంప్ తో ఉన్న ఫోటో ని షేర్ చేసిన ఫ్రిదా త్వరలోనే బుల్లి ట్రాన్‌ ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాడంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికి కూడా ఈ జంట పెళ్లి తేదిని ఖరారు చేయకపోవడం విశేషం. ఇక ఈ విషయం ప్రకటించిన వెంటనే ఫ్రిదా అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమెకు కంగ్రాట్స్ తెలుపుతున్నారు. ప్రస్తుతం ‘బ్రిటన్స్‌ వరల్డ్‌ వార్‌ 2’ తోపాటు ‘స్పై ప్రిన్సెస్‌: ద లైఫ్‌ ఆఫ్‌ నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌’ చిత్రాల్లో ​కీలక పాత్రలు పోషిస్తున్న ఈ భామ త్వరలోనే నిర్మాతగా కూడా మారనుంది.

Advertisement

Next Story

Most Viewed