ఆ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

by Shyam |
ఆ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
X

దిశ ,భువనగిరి : నిధుల కేటాయింపులో జాప్యంతో రంగారెడ్డి జిల్లా కాశగూడెం గ్రామానికి చెందిన యువ
సర్పంచ్ షేక్అజారోద్దీన్ ఆత్మహత్యకు పాల్పడ్డారనీ, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీఎం కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు రూ.15లక్షల నజరానా ఇస్తామని చేసిన ప్రకటనతో.. షేక్ అజారోద్దీన్‌ను కాశగూడెం ప్రజలు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు.

ప్రభుత్వ మాటలు నమ్మి సర్పంచ్ అజర్ ఆయన భార్య వంటి మీది వెండి ఆభరణాలను అమ్మి గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారని చెప్పారు. కాగా పనులకు బిల్లులు రాక, ప్రభుత్వం ఇస్తానన్న నజరానా అందక పురుగుల మందు తాగి మృతిచెందారని తెలిపారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యఫలితమేనని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సర్పంచ్ కుటుంబాన్నిఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed