ఫాంహౌస్‌లో గ్లాసులు కడుక్కోవడం యుద్ధమా!: రఘునందన్

by Shyam |
ఫాంహౌస్‌లో గ్లాసులు కడుక్కోవడం యుద్ధమా!: రఘునందన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఫైర్ అయ్యారు. కేంద్రంపై యుద్ధం చేస్తామంటున్న కేసీఆర్.. ఫౌమ్‌హౌస్‌లో కూర్చొని గ్లాసులు కడుక్కోవడం యుద్ధమా అని ఎద్దేవా చేశారు. దమ్ముంటే జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయాలని సవాల్ విసిరారు. ఆదివారం బీజేపీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నందుకే కరీంనగర్‌లో సరైన సమాధానం చెప్పారని పేర్కొన్నారు. కేంద్రం ఏమిచ్చిందని అంటున్న కేటీఆర్.. హైదరాబాద్‌కు మీరేమి చేశారని ప్రశ్నించారు. కేంద్ర నిధుల పంపిణీ ఏవిధంగా ఉంటుందో కేంద్రమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌కు తెలియదా అన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మంచినీటి సరఫరాపై టీఆర్‌ఎస్‌ నేతలు స్టడీ టూర్‌ చేయలేదా అని ప్రశ్నించారు. దేశ రక్షణ కేంద్రప్రభుత్వ బాధ్యతని, యాక్షన్‌కు రియాక్షన్‌ తప్పకుండా ఉంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed