జంట నగరాల్లో 2.5కోట్ల మొక్కల లక్ష్యంగా..

by Shyam |
జంట నగరాల్లో 2.5కోట్ల మొక్కల లక్ష్యంగా..
X

దిశ, సికింద్రాబాద్: జంట నగరాల్లో హరితహారంలో భాగంగా రెండున్నర కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో లక్షా 10 వేల మొక్కలు నాటనున్నట్లు ఆయన తెలిపారు. ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని గురువారం లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం ప్రాంగణంలో పద్మారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఉప కమిషనర్ మోహన్‌రెడ్డి, సికింద్రాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారిణి వసంత కుమారి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed