అరకు ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

by srinivas |   ( Updated:2021-02-12 10:02:48.0  )
Araku Ghat road accident
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణంలోని అరకు ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఐదో నెంబర్‌ మలుపు దగ్గర దినేష్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో పదిమందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. అంతేగాకుండా ఈ ఘటనలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీంతో గమనించిన స్థానిక అధికారులు వారందరినీ దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టారు. బాధితులంతా హైదరాబాద్ నగరవాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నట్టు గుర్తించారు.

కాగా, విషయం తెలిసిన మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం వెంటనే స్థానిక కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీవో‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story