- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెత్తురోడిన ఇరాక్.. ఆరుగురు మృతి
బాగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి రక్త మోడింది. గురువారం వరుసగా జరిగిన రెండు ఆత్మహుతి దాడుల్లో ఆరుగురు పౌరులు మృతి చెందగా, దాదాపు 25 మంది తీవ్ర గాయాల పాలయ్యారని పోలీసు అధికారులు తెలిపారు. బాగ్దాద్ నడిబొడ్డున గల వాణిజ్య సముదాయంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇద్దరు వ్యక్తులు ఆత్మహుతి దాడికి పాల్పడినట్లు ఇరాక్ జాతీయ మీడియా తెలిపింది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతోపాటు పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. బాగ్దాద్‌లోని రద్దీగా ఉండే వాణిజ్య సముదాయాలపై బాంబు దాడులు జరగడం చాలా ఏండ్ల తర్వాత ఇదే ప్రథమం.
ఈ ఏడాది అక్టోబర్‌లో ముందస్తు ఎన్నికల దృష్ట్యా తీవ్ర రాజకీయ అనిశ్చితుల నెలకొన్న నేపథ్యంలో ఆత్మాహుతి దాడి జరగడం గమనార్హం. ఏ ఉగ్రవాద సంస్థ కూడా తామే ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు ఇప్పటివరకు ప్రకటించుకోలేదు. గత కొన్ని నెలలుగా ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్, మిలిషియా గ్రూపులు బాంబు దాడులకు పాల్పడుతూ వస్తున్నాయి.